Russia-Ukraine War: యుద్ధంలోనూ లాభాలు పొందాలని ఉందా...5 డిఫెన్స్ స్టాక్స్ పై ఓ లుక్కేయండి..

Published : Mar 02, 2022, 05:35 PM IST
Russia-Ukraine War: యుద్ధంలోనూ లాభాలు పొందాలని ఉందా...5 డిఫెన్స్ స్టాక్స్ పై ఓ లుక్కేయండి..

సారాంశం

రష్యా, ఉక్రెయిన్ యుద్ధ వేళలో స్టాక్ మార్కెట్లలో రక్తపాతం మొదలైంది. ముఖ్యంగా యూఎస్, యూరప్ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో కూడా భారీ కరెక్షన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కూడా కొన్ని డిఫెన్స్ స్టాక్స్ మదుపరులకు లాభాలు అందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా రక్షణ వ్యయంలో భారీ పెరుగుదల ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా తైవాన్ చుట్టుపక్కల చైనా సముద్ర ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్లోబల్ మార్కెట్లలో డిఫెన్స్ స్టాక్స్ పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారతదేశంలోని విశ్లేషకులు కూడా రక్షణ రంగ స్టాక్‌లపై చాలా బుల్లిష్‌గా ఉన్నారు. Bharat Dynamics, Bharat Forge, Bharat Electronics, Hindustan Aeronautical Limited, L&T వంటి షేర్లను పొజిషనల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

SMC గ్లోబల్ సెక్యూరిటీస్‌కు చెందిన సౌరభ్ జైన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల జర్మనీ తన రక్షణ వ్యయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. యూరప్‌లోని ఇతర దేశాలు కూడా అదే పని చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్‌కు (IIFL Securities) చెందిన అనుజ్ గుప్తా మాట్లాడుతూ, యుఎస్-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా, చైనా,  తైవాన్‌ల మధ్య సంక్షోభం కూడా పెరుగుతోందని  ప్రపంచంలోని అన్ని దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచడం గమనించవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో  భారతదేశ రక్షణ వ్యయం కూడా పెరుగుతుందని,  ప్రస్తుతం ఉన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, భారతదేశానికి వేరే మార్గం లేదు.

చాలా కాలంగా రక్షణ రంగంలో బలమైన ముద్ర వేస్తున్న ఇలాంటి డిఫెన్స్ స్టాక్స్‌పై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచాలని SMC గ్లోబల్‌కు చెందిన సౌరభ్ జైన్ అంటున్నారు. Bharat Dynamics, Bharat Forge, Bharat Electronics, Hindustan Aeronautical Limited, L&T  వంటి స్టాక్‌లు బుల్లిష్ గా ఉన్నట్లు తెలిపారు. 

అదే సమయంలో, IIFL సెక్యూరిటీస్‌కు చెందిన అనుజ్ గుప్తా మాట్లాడుతూ, ఎవరైనా పెట్టుబడి  చూస్తూ ఉంటే మాత్రం, ఈ 5 రక్షణ స్టాక్‌లపై ఓ లుక్ వేయవచ్చని తెలిపారు. ఇందులోనూ భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్‌ఏఎల్, భారత్ డైనమిక్స్ ది బెస్ట్ అని అన్నారు. ప్రస్తుత స్థాయిలో  రూ. 280 టార్గెట్ , రూ. 185 స్టాప్ లాస్‌తో భారత్ ఎలక్ట్రానిక్స్‌లో  Buy సలహా ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా, ప్రస్తుత ధర ప్రకారం రూ.1800 మీడియం టర్మ్ టార్గెట్ కోసం రూ.1180 స్టాప్ లాస్‌తో HALలో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. మరోవైపు, భారత్ డైనమిక్స్‌లో ప్రస్తుత ధరల ప్రకారం రూ. 580  లక్ష్యంతో రూ. 380 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయవచ్చు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !