NSE Scam:మాజీ ఎన్‌ఎస్‌ఇ అధికారిని అరెస్టు చేసిన సిబిఐ.. నియామకం, ప్రమోషన్‌లో లోపాలు ఉన్నాయంటు ఆరోపణ..

Ashok Kumar   | Asianet News
Published : Feb 25, 2022, 01:27 PM ISTUpdated : Feb 25, 2022, 01:29 PM IST
NSE Scam:మాజీ ఎన్‌ఎస్‌ఇ అధికారిని అరెస్టు  చేసిన సిబిఐ.. నియామకం, ప్రమోషన్‌లో లోపాలు ఉన్నాయంటు ఆరోపణ..

సారాంశం

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ చిత్రా రామకృష్ణ సలహాదారి ఆనంద్ సుబ్రమణ్యంను సీబీఐ నిన్న అర్థరాత్రి చెన్నైలో అరెస్టు చేసింది. ఆనంద్ సుబ్రమణ్యం ఎన్‌ఎస్‌ఈలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. సుబ్రమణియన్ నియామకం, అతని అవుట్‌సైజ్డ్ ప్రమోషన్‌లో పాలనా లోపాలున్నాయని చిత్రా రామకృష్ణ మరియు ఇతరులపై సెబి అభియోగాలు మోపింది.

న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్ ని స్టాక్ మార్కెట్ అవకతవకలకు సంబంధించిన కేసులో సిబిఐ గురువారం అర్థరాత్రి  ఆనంద్ సుబ్రమణియన్ని  చెన్నైలో అరెస్టు చేసింది. అయితే హిమాలయాల్లో నివసిస్తున్న యోగి ద్వారా  ప్రేరేరితమైన నిర్ణయాలలో అతని నియామకం ఉంది. 

స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నివేదికలో "ఫ్రెష్ ఫాక్ట్స్" వెలువడుతున్నందున అరెస్టు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.ఆనంద్ సుబ్రమణియన్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి లుక్‌అవుట్ నోటీసు కూడా జారీ చేసినట్లు తెలిపింది. చెన్నైలోని ఆయన నివాసంపై కూడా సీబీఐ సోదాలు చేసినట్లు నివేదిక పేర్కొంది.

ఆనంద్ సుబ్రమణియన్‌ను అరెస్టు చేయాలని ఏజెన్సీ నిర్ణయించడానికి ముందు చెన్నైలో  కొన్ని రోజుల పాటు అతనిని ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు.ఆనంద్ సుబ్రమణియన్ తొలిసారిగా 2013లో ఎన్‌ఎస్‌ఈలో చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియమితులయ్యారు, ఆపై మేనేజింగ్ డైరెక్టర్ చిత్రా రామకృష్ణ ద్వారా 2015లో గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. 2016లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయన నిష్క్రమించారు.

చిత్రా రామకృష్ణ నిర్ణయాలను ప్రభావితం చేసిన హిమాలయాలలోని ఒక "యోగి"తో రహస్య సమాచారాన్ని పంచుకున్నారనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. సెబి ప్రకారం ఆ నిర్ణయాలలో ఒకటి ఆనంద్ సుబ్రమణియన్ నియామకం ఆలాగే పర్ఫర్మెంస్ ఎవాల్యుయేషన్  వంటి ఎటువంటి ఆధారాలు లేకుండా అతని జీతంలో పెంపుదల.  

సుబ్రమణియన్ నియామకం, అతని ప్రమోషన్‌లో లోపాలున్నాయని చిత్రా రామకృష్ణ, ఇతరులపై సెబి అభియోగాలు మోపింది. సెబి రామకృష్ణకు రూ.3 కోట్లు జరిమానా విధించింది. సుబ్రమణియన్, ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎం‌డి అండ్ సి‌ఈ‌ఓ రవి నారాయణ్‌పై ఒక్కొక్కరికి 2 కోట్ల జరిమానా విధిం

PREV
click me!

Recommended Stories

Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!