Cryptocurrency price:స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్న క్రిప్టోకరెన్సీ జోరు.. నేడు 11% ఎగిసిన బిట్‌కాయిన్ ధర

Ashok Kumar   | Asianet News
Published : Feb 25, 2022, 12:42 PM ISTUpdated : Feb 25, 2022, 12:47 PM IST
Cryptocurrency price:స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్న క్రిప్టోకరెన్సీ జోరు.. నేడు  11%  ఎగిసిన బిట్‌కాయిన్ ధర

సారాంశం

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ 11 శాతం పెరిగి $38,816.10 వద్ద ఉంది. అయితే ఇప్పటికీ $40,000-మార్క్ కంటే తక్కువగా ఉంది.

గ్లోబల్ క్రిప్టోకరెన్సీ వాల్యు పడిపోయిన తర్వాత  శుక్రవారం తిరిగి పుంజుకోవడంతో బిట్‌కాయిన్ ధరలు పెరిగాయి. కాయిన్‌డెస్క్ ప్రకారం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన్నప్పటికీ చాలా  వరకు క్రిప్టోకరెన్సీలు లాభాల్లో  ట్రేడింగ్ అవుతున్నాయి.

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ  బిట్‌కాయిన్ 11 శాతం పెరిగి 38,816.10 డాలర్ల వద్ద ఉండగా, అయినప్పటికీ 40,000 డాలర్ల-మార్క్ కంటే తక్కువగా ఉంది. రెండవది మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా క్రిప్టోకరెన్సీ ఈతెరియం (Ethereum) 9 శాతం పెరిగి 2,623.83 డాలర్ల వద్ద ఉంది.

ఎక్స్‌ఆర్‌పి (XRP)ధర 7 శాతానికి పైగా పెరిగగా, టెర్రా(Terra) 20 శాతం కంటే పైగా పెరిగింది, సోలానా(Solana) 14 శాతానికి పైగా ట్రేడవుతోంది, అవలాంచె(Avalanche) 11 శాతం పెరిగింది, కార్డానో (Cardano)ధర 11 శాతానికి పైగా పెరిగింది.

ఇతర ప్రముఖ క్రిప్టోకరెన్సీలు పోల్కాడోట్ (Polkadot)7 శాతంపైగా ఎగబాకగా, డాడ్జ్‌కాయిన్(Dodgecoin) 5 శాతానికి పైగా, పాలిగాన్ (Polygon)9 శాతానికి పైగా, షిబా ఇను (Shiba Inu)5 శాతానికి పైగా పెరిగింది.

"గత 24 గంటల్లో బిట్‌కాయిన్ , ఈతెరియం యూ‌ఎస్ 39,000 డాలర్లు ఇంకా యూ‌ఎస్ 3,000 డాలర్ల దిగువకు పడిపోయాయి. వారంలోని చివరి రోజున అన్ని ప్రముఖ ఆల్ట్‌కాయిన్‌లు కూడా నష్టాలలో  పయనిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా అమ్మకాల ఒత్తిడి పెరగడంతో బి‌టి‌సి (BTC) ప్రతికూలంగా ఉంది" అని మడ్రెక్స్  (Mudrex) సి‌ఈ‌ఓ అండ్ సహ వ్యవస్థాపకుడు ఎడుల్ పటేల్ చెప్పారు.

"బి‌టి‌సి  తక్కువ మద్దతు ధర యూ‌ఎస్ 30,000 నుండి యూ‌ఎస్ 35,000 డాలర్ల మధ్య ఉంటుంది. బి‌టి‌సి ఈ మద్దతు స్థాయిల కంటే దిగువకు వెళితే 2018లో ట్రెండ్‌కి తిరిగి వెళ్లవచ్చు. రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది" అని ఎడుల్ పటేల్ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Saree Business: ఇంట్లోనే చీరల బిజినెస్ ఇలా, తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష సంపాదించే ఛాన్స్
Low Budget Phones: రూ.10,000లోపు వచ్చే అద్భుతమైన 5G ఫోన్లు ఇవిగో