e-Shram card:మీకు కూడా వెయ్యి రూపాయలు ఇన్‌స్టాల్‌మెంట్ కావాలంటే, వెంటనే ఈ పని చేయండి..

Ashok Kumar   | Asianet News
Published : Mar 15, 2022, 01:59 PM IST
e-Shram card:మీకు కూడా  వెయ్యి రూపాయలు ఇన్‌స్టాల్‌మెంట్ కావాలంటే, వెంటనే ఈ పని చేయండి..

సారాంశం

కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అనేక రకాల పథకాలు  ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఇటువంటి ఒక పథకం కేంద్ర ప్రభుత్వం అండ్ కార్మిక మంత్రిత్వ శాఖ సహకారంతో అమలు చేయబడుతోంది

దేశంలో ప్రస్తుతం ఉన్న పేద, నీరుపెద వర్గాలకు ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. ప్రజలకు ఆర్థిక సహాయం చేయడమే వీటి ముఖ్య ఉద్దేశం. ఆరోగ్యం, ఆర్థిక ప్రయోజనాలు, బీమా పథకాలు, రేషన్ పథకాలు, ఉపాధి పథకాలు మొదలైన వాటితో సహా ప్రభుత్వం అమలు చేసే అనేక రకాల పథకాలు  అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఇటువంటి ఒక పథకం కేంద్ర ప్రభుత్వం అండ్ కార్మిక మంత్రిత్వ శాఖ సహకారంతో అమలు చేయబడుతోంది, దీనికి ఈ-శ్రమ్ కార్డ్ స్కీమ్ అని పేరు పెట్టారు.

ఇందులో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించడమే కాకుండా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు.  మొదటి విడత ఈ-శ్రమ్ కార్డు హోల్డర్ల వచ్చిన ఇంస్టాల్మెంట్ తర్వాత, ఇప్పుడు అందరూ రెండవ విడత కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అంతకు ముందు, మీ రెండవ విడత ఇంస్టాల్మెంట్  చిక్కుకుపోవచ్చని మీరు దాన్ని ఎలా పరిష్కరించగలరో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఫార్మ్ లో ఏదైనా తప్పు ఉంటే మీ ఇంస్టాల్మెంట్ నిలిచిపోవచ్చు. అందుకే ముందుగా మీ ఫారమ్‌ని మెరుగుపరచుకోవడం ముఖ్యం.

ఫారమ్‌లోని తప్పులను సరిదిద్దండి:-

స్టెప్ 1
మీ ఫారమ్‌లో ఏదైనా తప్పులు ఉంటే  దాన్ని సరిదిద్దడం ద్వారా మీరు ఇన్‌స్టాల్‌మెంట్  ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, మీరు ముందుగా eshram.gov.inలోని e-shram అధికారిక పోర్టల్‌కి వెళ్లాలి.

స్టెప్ 2
ఇక్కడ మీరు 'registered' ఆప్షన్ చూస్తారు, దానిపై క్లిక్ చేయండి. ఆపై ఫారమ్‌లో నింపిన మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి, ఆ తర్వాత వన్ టైమ్ పాస్‌వర్డ్ అంటే మీ నంబర్‌పై OTP వస్తుంది.

స్టెప్ 3
నంబర్‌పై అందుకున్న OTPని ఎంటర్ చేసి, ఆపై సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'profile' ట్యాబ్ కి వెళ్లి ఇక్కడ  మీ ఫారమ్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 4
ఫారమ్‌ను తెరిచిన తర్వాత, తప్పులను సరిదిద్దండి. ఆపై ఫారమ్‌ను సమర్పించండి. దీని తర్వాత, ఈ-శ్రామ్ కార్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ మీ బ్యాంక్ ఖాతాకు చేరడం ప్రారంభమవుతుంది.

రెండో విడత ఎప్పుడు రావచ్చు?
ఇక రెండో విడత ఇన్‌స్టాల్‌మెంట్  గురించి మాట్లాడితే.. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెలాఖరులోగా ప్రభుత్వం రెండో విడతగా వెయ్యి రూపాయలను ప్రజలకు చేరవేయవచ్చు.

ఇలా రిజిస్టర్ చేసుకోవచ్చు
మీరు ఇంకా e-shram కార్డ్‌ని పొందకుంటే, మీరు అధికారిక వెబ్‌సైట్ eshram.gov.inని సందర్శించి  నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా, మీరు మీ సమీపంలోని CSC కేంద్రాన్ని సందర్శించడం ద్వారా కూడా ఈ కార్డును పొందవచ్చు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Silver ETF: వెండిని ఇలా తెలివిగా కొనండి.. ఇష్టం ఉన్న‌ప్పుడు, ఒక్క క్లిక్‌తో అమ్ముకోవ‌చ్చు
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?