అంబానీ దేశం విడిచి పారిపోకుండా ఆపండి...సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

By Arun Kumar PFirst Published Oct 3, 2018, 4:07 PM IST
Highlights

అనిల్ అంబానీ... భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. ధీరూబాయ్ అంబానీ వారసుడిగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే మంచి వ్యాపారవేత్తగా ఎదిగాడు. కానీ ఇప్పుడు అనిల్ అంబానీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. మొదట్లో రిలయన్స్‌ కమ్యూనికేషన్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ముంబై మెట్రో, రిలయన్స్‌ రోడ్స్‌, రిలయన్స్‌ డిఫెన్స్‌, రిలయన్స్‌ నావల్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి వంటి భిన్న రంగాల్లో లాభాలను అర్జించిన అనిల్‌ కంపెనీలు ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. కేవలం ఆర్‌కామ్‌ రుణ భారమే రూ.47,000 కోట్లకు చేరుకుందని తెలుస్తోంది.
 
అయితే ఈ  అప్పులను ఎగొట్టడానికి అనీల్ అంబానీ విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఎరిక్‌సన్ అనే కంపనీ ఆరోపిస్తోంది. అనీల్ అంబానీతో పాటు ఆర్కామ్ కంపెనీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ లను దేశం వదిలిపెట్టి పారిపోకుండా చూడాలని ఈ స్వీడిష్ టెలికాం కంపెనీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ కంపనీకి అనీల్ అంబానీ రూ. 1600 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని సకాలంలో చెల్లించకపోవడంతో ఎరిక్ సన్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఇరు పక్షాల మధ్య కోర్టు మధ్యవర్తిత్వం వహించడంతో తమ మకాయిల మొత్తాన్ని ఎరిక్ సన్  రూ.550 కోట్లకు తగ్గించుకుంది. అయితే ఈ మొత్తాన్ని సెప్టెంబర్ 30 వరకు చెల్లించాలని ఒప్పందం కుదిరింది. అయితే ఈ సమయం ముగిసినా బకాయిలు చెల్లించకపోవడంతో ఎరిక్‌సన్ సంస్థ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనీల్ అంబానీ దేశాన్ని వదిలిపెట్టకుండా చూడాలని కోర్టును కోరింది. 

click me!