
EPFO: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాబోయే హోలీ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త తెలపనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO)లో డబ్బు డిపాజిట్ చేసే వారికి ఇది నిజంగానే శుభవార్త. హోలీ రోజున, ఉద్యోగులు మునుపటి కంటే PF పై ఎక్కువ వడ్డీని పొందే వీలుందని మీడియా నివేదికల ద్వారా వార్తలు బయటకు వస్తున్నాయి.
EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం వచ్చే నెల మార్చి 11 మరియు 12 తేదీలలో గౌహతిలో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచడం, పీఎఫ్‌పై వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడం ఈ సమావేశంలో ప్రధాన అజెండా అని పేర్కొంటున్నారు.
ఈ హోలీ సందర్భంగా ఉద్యోగులు EPFO నుంచి బహుమతి పొందవచ్చు. గౌహతిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఈ సమావేశం జరగనుంది, ఇందులో ముఖ్యమైన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈపీఎఫ్‌లో డిపాజిట్ చేసిన మొత్తంపై ప్రస్తుత వడ్డీ రేటు 8.5 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పీఎఫ్‌పై 8.5 శాతం వడ్డీ లభిస్తోంది. పీఎఫ్‌పై లభించే అతి తక్కువ వడ్డీ ఇదే కావడం గమనార్హం. ఇంతకుముందు, పీఎఫ్ వడ్డీ రేటు 2018-19లో 8.65 శాతం, 2016-17లో 8.65 శాతం మరియు 2017-18లో 8.55 శాతంగా ఉంది.
వడ్డీ రేట్ల పెంపునకు CBT సభ్యులు అనుకూలంగా ఉన్నారు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం మార్చి 11-12 తేదీల్లో జరగనుంది. అదే సమయంలో, CBTలోని కొంతమంది సభ్యులు PF పై వడ్డీ రేటును పెంచడానికి అనుకూలంగా ఉన్నారు. 2020-21లో CBT 8.5% వడ్డీతో నిర్ణయించారు. 2015-16లో అత్యధికంగా 8.80% వడ్డీ లభించింది. EPF అనేది ఉద్యోగి, కంపెనీ రెండింటి కాంట్రిబ్యూషన్ ద్వారా అందిస్తారు. సీబీటీ సిఫారసులపై ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోనుంది.
ఈ అంశాలపై కూడా చర్చించనున్నారు
మీడియా కథనాల ప్రకారం, కేంద్ర కార్మిక సంఘాలు ప్రస్తుత కనీస పెన్షన్‌ను రూ.1,000 నుండి రూ.6,000కి పెంచాలని డిమాండ్ చేశాయి, అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ లేదా CBT దానిని రూ.3,000కి పెంచవచ్చు.
ప్రైవేట్ కార్పొరేట్ బాండ్లలో EPFO డబ్బును పెట్టుబడి పెట్టే వివాదాస్పద అంశం కూడా సమావేశంలో చర్చనీయాంశం కానుంది. అలాగే, 2021-22కి పెన్షన్ ఫండ్ వడ్డీ రేటు ఎంత ఉండాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకోవచ్చు. కనీస పెన్షన్‌ను రూ.3,000కి పెంచాలని CBT నిర్ణయించవచ్చు. సుదీర్ఘ కాలం ఈ మొత్తం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.