Elon Musk: ఎలాన్‌ మస్క్‌పై కోర్టుకెక్కిన ట్రాన్స్‌జెండర్ కూతురు.. ఎందుకంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jun 21, 2022, 11:19 AM IST
Elon Musk: ఎలాన్‌ మస్క్‌పై కోర్టుకెక్కిన ట్రాన్స్‌జెండర్ కూతురు.. ఎందుకంటే..?

సారాంశం

ఎలాన్ మస్క్ ట్రాన్స్‌జెండర్ కుమార్తె తన పేరును మార్చడానికి పిటిషన్ దాఖలు చేసింది. నేను ఇకపై నా పుట్టుకకు కారణమైన తండ్రితో ఏ విధమైన సంబంధంతో గానీ, పేరుతో గానీ జీవించాలనుకోవడం లేదు. పేరు మార్పు, కొత్త లింగ గుర్తింపును సూచించే కొత్త బర్త్ సర్టిఫికేట్ రెండింటి కోసం ఏప్రిల్‌లో శాంటా మోనికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.   

ఎలాన్‌ మస్క్‌ మొదటి భార్య కెనడా నటి జస్టిన్‌ విల్సన్‌. 2000 సంవత్సరంలో జస్టిన్‌ను మస్క్‌ వివాహం చేసుకుని ఎనిమిదేళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. ఈ ఇద్దరికీ ఆరుగురు సంతానం. తొలి దఫాలో ఐవీఎఫ్‌ ద్వారా కవలలను కంది జస్టిన్‌. ఇందులో ఒకడే గ్జావియర్‌ అలెగ్జాండర్‌ మస్క్‌. ఇక విడాకుల తర్వాత తల్లిదండ్రులు పిల్లల సంరక్షణను సమానం చూస్తున్నారు. అయితే గ్జావియర్‌ అలెగ్జాండర్‌ మస్క్ ‘ట్రాన్స్‌జెండర్‌’. సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిపోయాడు. వివియన్‌ జెన్నా విల్సన్‌గా పేరు మార్చుకున్నాడు. తాజాగా 18 ఏళ్లు నిండడంతో ఎలాన్‌ మస్క్‌తో తనకు సంబంధాలు వద్దంటూ కోర్టుకు ఎక్కింది. 

‘‘నేను ఇకపై ఏ విధంగా, ఆకారం,  రూపం, గుర్తింపులో.. కన్నతండ్రి నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నా. ఆయన గుర్తింపు ఇకపై నాకు అక్కర్లేదు. నా పేరు మార్పిడికి అనుమతించండి. నా లింగమార్పిడికి చట్టబద్ధత ఇవ్వండి’’ అంటూ..  శాంటా మోనికాలోని లాస్‌ ఏంజెల్స్‌ కౌంటీ సుపీరియర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే.. ఏప్రిల్‌ నెల చివర్లోనే వివియన్‌ తన పిటిషన్‌ దాఖలు చేసింది. కానీ, అందులోని ఆసక్తికర వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

కాలిఫోర్నియాలో ఉంటున్న గ్జావియర్‌ అలెగ్జాండర్‌ మస్క్ (వివియన్‌ జెన్నా విల్సన్‌) తన కొత్త పేరుకు అధికారిక గుర్తింపు ఇవ్వడంతో పాటు కన్నతండ్రి ఎలాన్‌ మస్క్‌ గుర్తింపును, ఆయన అందించే సాయాలను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. తండ్రి నీడలో బతకడం ఇష్టం లేదంటూ పిటిషన్‌లో పేర్కొంది వివియన్‌. ఇదిలా ఉంటే.. ఆ తండ్రి, ట్రాన్స్‌జెండర్‌ కూతురు మధ్య గొడవ ఏంటన్నదానిపై స్పష్టత లేదు. ఇరు పక్షాల లాయర్స్‌ సైతం దీనిపై స్పందించలేదు. మరోవైపు ట్రాన్స్‌జెండర్‌ హక్కుల విషయంలో రిపబ్లికన్‌ పార్టీకి మద్దతు ప్రకటించాడు ఎలాన్‌ మస్క్‌. తాజా చట్టం ప్రకారం అమెరికాలో ట్రాన్స్‌జెండర్‌ హక్కులపై పరిమితులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో తండ్రి వైఖరిపై అసంతృప్తితోనే గ్జావియర్‌ అలియాస్‌ వివియన్‌ ఇలా పిటిషన్‌ వేసి ఉంటుందని భావిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

India US Relations : తగ్గేదేలే ! రష్యా చమురుపై అమెరికాకు ఇండియా మాస్ వార్నింగ్
Stock: కండోమ్ కంపెనీ కాసుల వర్షం కురిపించిందిగా.. రూ. లక్షను ఏకంగా రూ. 38 లక్షలుగా మార్చింది..