లింకెడిన్ కు పోటీగా X నుంచి ఉద్యోగాల హైరింగ్ సర్వీసు ప్రారంభం..ఇకపై X ప్లాట్‌ఫారంలో ఉద్యోగాలు వెతుక్కోవచ్చు..

By Krishna Adithya  |  First Published Aug 27, 2023, 2:57 PM IST

లింకెడిన్ తరహాలో ఇకపై X ( గతంలో ట్విట్టర్ ) కూడా రిక్రూటింగ్ సర్వీసును ప్రారంభించనుంది. దీని ద్వారా ఇకపై నిరుద్యోగులు ఈ ప్లాట్ ఫారం ద్వారా ఉద్యోగాలను సైతం పొందే వీలుంది. 


ఎలోన్ మస్క్ 'X' సంస్థ (గతంలో ట్విట్టర్)లో కొత్త ప్రయోగాలు  చేసేందుకు తెరలేపారు. ఇప్పుడు 'X' ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ రంగంలోకి కూడా ప్రవేశించింది.  ఇకపై మీరు ట్విట్టర్ ద్వారా ఉద్యోగాలు కూడా అన్వేషించుకోవచ్చు అలాగే మీరు ఉద్యోగులను కూడా నియమించుకునేందుకు ప్రకటనలను జారీ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ స్పేస్ లో లింక్టింగ్ లాంటి వెబ్సైట్లు యాక్టివ్ గా ఉన్నాయి అయితే తాజాగా ఎక్స్ ప్లాట్ఫారం ద్వారా కూడా ఇలాంటి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ సన్నాహాలు చేస్తున్నారు.

X తన ప్లాట్‌ఫారమ్‌లో హైరింగ్ బీటా వెర్షన్‌ను ప్రారంభించడం ద్వారా కొత్త సర్వీసును పరిచయం చేసింది..దీంతొ ఇప్పటికే ఉన్న లింక్డ్‌ఇన్ వంటి జాబ్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కఠినమైన సవాలును  ఎదుర్కొనే అవకాశం ఉంది. లింకెడిన్ ఇప్పటికే ప్రపంచంలోనే వందకు పైగా దేశాల్లో తన సర్వీసులను అందిస్తోంది. 

Latest Videos

X హైరింగ్ బీటాను ప్రారంభించడం ద్వారా  ఇకపై ఉద్యోగాలు కూడా ఈ ప్లాట్ఫారం ద్వారా పొందే అవకాశం ఉన్నట్లు సూచనలు అందుతున్నాయి.  X శనివారం ఒక పోస్ట్‌లో పలు కీలక అంశాలను పేర్కొంది.  చాలా మంది వినియోగదారులు X కు చెందిన ఈ కొత్త సర్వీసుపై పలు ప్రశ్నలను లేవనెత్తారు, కొంతమంది వినియోగదారులు ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌ల గురించి కూడా తమ ఆందోళనలను వ్యక్తం చేశారు.

కొత్త ఫీచర్ ధృవీకరించబడిన సంస్థలను వారి X ప్రొఫైల్‌లలో ఉద్యోగ భర్తీలను పోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ సర్వీసు  కోసం ఆథంటికేషన్ పొందాలి. దీని కోసం నెలకు 1,000 డాలర్లు చెల్లించాలి. ఇందులో ఉద్యోగ  సంస్థల ప్రొఫైల్‌లో మనకు కనిపిస్తాయి  అభ్యర్థులు ఉద్యోగాల కోసం నేరుగా Xలో దరఖాస్తు చేసుకోవచ్చు. యజమానులు ప్లాట్‌ఫారమ్ ద్వారా వారిని సంప్రదించవచ్చు.

“ఎక్స్ హైరింగ్ సర్వీస్ కోసం సైన్ అప్ చేయండి, ఇది ఇప్పటికే ధృవీకరించబడిన సంస్థలకు అందుబాటులో ఉంది. అర్హత ఉంటే, మేము మీ ఖాతాలో హైరింగ్ ఫీచర్‌లను ప్రారంభిస్తాము,” అని X  ఒక ట్వీట్ ద్వారా తెలిపింది. .

Musk's  X దాని ఉద్యోగ నియామక ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించడంతో, ఇది రిక్రూటింగ్ ప్రక్రియకు ఒక కొత్త మలుపును తీసుకురాగలదని అంతా భావిస్తున్నారు.  అయితే ఇప్పటికే లింకెడిన్ సంస్థ  ఇందులో ప్రత్యేకంగా దూసుకెళ్తోంది.  ఒకవేళ ఎక్స్ కనుక ఈ సర్వీసును పెద్ద ఎత్తున ప్రారంభించినట్లయితే అనేక కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ట్విట్టర్ ద్వారా ప్రకటనలు ద్వారా చేసే అవకాశం కనిపిస్తుంది. . అలాగే పెద్ద ఎత్తున యూజర్లు కూడా ఉద్యోగాల కోసం ట్విట్టర్ ఖాతాదారులుగా మారే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.  ఇందులో పెయిడ్ సర్వీసులు సైతం ఉండడం ద్వారా సంస్థకు రెవెన్యూ కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

click me!