వచ్చే ఆరు నెలల్లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల్లో 25 షోరూమ్‌లను ఏర్పాటు చేయబోతున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ సర్కార్ (B2C) తెలిపారు.
గోద్రెజ్ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ గోద్రెజ్ అండ్ బోయ్స్,కు చెందిన ప్రముఖ ఫర్నిచర్ , ఇంటీరియర్ సొల్యూషన్స్ బ్రాండ్ గోద్రెజ్ ఇంటీరియో దేశవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా పెట్టుబడితో 100 సొంత షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
వచ్చే ఆరు నెలల్లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల్లో 25 షోరూమ్‌లను ఏర్పాటు చేయబోతున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ సర్కార్ (B2C) తెలిపారు. ప్రస్తుతం ఉన్న 40 షోరూమ్‌లతో 25 శాతానికి పైగా ఈ విభాగంలో మార్కెట్ షేర్ కడిగి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2026 నాటికి మార్కెట్ వాటా 30 శాతం వాటాను కైవసం చేసుకోవచ్చని దేవ్ సర్కార్ తెలిపారు.
గోద్రెజ్ ఇంటీరియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ సర్కార్ (B2C) హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.ఆయన పలు కీలక అంశాలు తెలిపారు. దక్షిణాది మార్కెట్ , ప్రాముఖ్యతపై ఆయన మాట్లాడుతూ, బ్రాండ్‌కు 55 మందికి పైగా ఛానెల్ భాగస్వాములు ఉన్నారని , తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరంలో 25 మల్టీ-బ్రాండ్ అవుట్‌లెట్‌లను ప్రారంభించామని చెప్పారు.
మొత్తంగా, దక్షిణ భారతదేశం అంతటా 200 ప్లస్ ఛానెల్ భాగస్వాములను కలిగి ఉన్నారని తెలిపారు. తెలంగాణలో కంపెనీ ఎక్కువగా లివింగ్ రూమ్, బెడ్‌రూమ్, కిచెన్‌ల కేటగిరీపై ప్రధాన దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు, ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ అంతటా కంపెనీని బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు, 2026 నాటికి దక్షిణ భారతదేశం నుండి సుమారు 350 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించడమే మా లక్ష్యం అని దేవ్ చెప్పారు. .
రాబోయే ఆర్థిక సంవత్సరంలో అన్ని ఉత్పత్తుల్లోనూ 25 శాతానికి పైగా గణనీయమైన వృద్ధిని సాధించడమే లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. రాబోయే దసరా, దీపావళి పండుగ వేడుకలకు అనుగుణంగా, గోద్రెజ్ ఇంటీరియో 30 శాతం వరకు డిస్కౌంట్ లను అందిస్తోంది. సెప్టెంబరు 15 నుండి నవంబర్ 15 వరకు ప్రత్యేకమైన స్క్రాచ్ కార్డ్ ద్వారా ఉచిత ఫర్నిచర్‌ను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఈ రెండు నెలల్లో, ఇది మొత్తం అమ్మకాలపై 35 శాతం సహకరిస్తుందని ఆయన తెలిపారు. కంపెనీకి ముంబై, ఖలాపూర్, హరిద్వార్, షిర్వాల్ , భగవాన్‌పూర్‌లలో 7 తయారీ కేంద్రాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.