Bank Holidays April 2023: ఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకులు బంద్, RBI సెలవుల జాబితా ఇదే..

By Krishna AdithyaFirst Published Mar 27, 2023, 2:41 PM IST
Highlights

శని, ఆదివారం సెలవులతో సహా ఏప్రిల్ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. అందుకే RBI విడుదల చేసిన బ్యాంకు సెలవుల జాబితాను తనిఖీ చేసి మీ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోండి..

మార్చి నెలాఖరుకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి కొత్త నెల ప్రారంభానికి ముందు సెలవుల జాబితాను RBI విడుదల చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్‌ సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. వారాంతపు సెలవులతో సహా ఏప్రిల్ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. వార్షిక ఖాతాల మూసివేత, మహావీర్ జయంతి, బాబూ జగజ్జీవన్ రామ్ పుట్టినరోజు, గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి మొదలైన ప్రత్యేక రోజులలో బ్యాంకులు మూసివేయనున్నారు. కాబట్టి ఏప్రిల్ నెలలో బ్యాంకును సందర్శించే ఖాతాదారులు ఈ సెలవుల జాబితాను ఒకసారి తనిఖీ చేసుకోండి. అయితే RBI సెలవుల జాబితాలోని బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండుగల ప్రకారం సెలవులు ఇస్తారు. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ హాలిడేస్ మాత్రం కామన్ గా ఉంటాయి.

బ్యాంకు సెలవుల్లో ఆన్‌లైన్ లావాదేవీలు, ATM లావాదేవీలు ప్రభావితం కావు. అయితే ఏదైనా పని ఉంటే మాత్రం బ్యాంకుకు వెళ్లడం వాయిదా వేసుకోవడం మంచిది. కొన్నిసార్లు, మీరు ఇల్లు లేదా భూమి, కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే, రుణ ప్రక్రియ కోసం బ్యాంకును సందర్శించడం అవసరం. అలాగే బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేయాలన్నా, ఇతర ఇన్వెస్ట్‌మెంట్ పథకాల్లో మదుపు చేయాలని ప్లాన్ చేసుకున్నా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏయే రోజులలో సెలవులు ఉన్నాయో ముందుగా గమనించి, ఆ తర్వాత బ్యాంకు సందర్శనకు ప్రణాళిక వేసుకోవడం మంచిది.

ఏప్రిల్ బ్యాంకు సెలవుల జాబితా:
ఏప్రిల్ 1: బ్యాంకులు వార్షిక మూసివేత కారణంగా సెలవు
ఏప్రిల్ 2: ఆదివారం
ఏప్రిల్ 4: మహావీర జయంతి 
ఏప్రిల్ 5: జగజ్జీవన రామ్ జయంతి 
ఏప్రిల్ 7: గుడ్ ఫ్రైడే 
ఏప్రిల్ 8: రెండవ శనివారం
ఏప్రిల్ 9: ఆదివారం
ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి 
ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సరం (అగర్తలా, గౌహతి, కోల్‌కతా బ్యాంకులకు సెలవు) 
ఏప్రిల్ 16: ఆదివారం 
ఏప్రిల్ 18: షాబ్-ఎ-క్వార్డ్ (జమ్మూ, కాశ్మీర్‌లో బ్యాంకు శాఖలకు సెలవు).
ఏప్రిల్ 21: ఈద్-ఉల్-ఫితర్ 
ఏప్రిల్ 22: నాలుగో శనివారం
ఏప్రిల్ 23: ఆదివారం
ఏప్రిల్ 30: ఆదివారం
 

click me!