ట్విట్టర్ బ్లూ టిక్ గురించి ఎలాన్ మస్క్ కీలక ప్రకటన...డబ్బులు చెల్లించకపోతే ఏప్రిల్ 20 నుంచి నో బ్లూటిక్..

Published : Apr 14, 2023, 01:52 AM IST
ట్విట్టర్ బ్లూ టిక్ గురించి ఎలాన్ మస్క్ కీలక ప్రకటన...డబ్బులు చెల్లించకపోతే ఏప్రిల్ 20 నుంచి నో బ్లూటిక్..

సారాంశం

ట్విట్టర్ బ్లూ టిక్ గురించి ఎలోన్ మస్క్ చేసిన పెద్ద ప్రకటన యూజర్లను కలవరానికి గురి చేస్తోంది. డబ్బులు చెల్లించకపోతే యూజర్ ప్రొఫైల్ పక్కన ఉన్న బ్లూ టిక్ తీసివేస్తామని తెలిపింది. 

ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పటి నుండి ఏదో ఒక వివాదంతో ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫారం నిరంతరం చర్చలో ఉంది. కొన్నిసార్లు ట్విట్టర్ నుండి బ్లూ టిక్‌ను తీసివేయడం గురించి, కొన్నిసార్లు ట్విట్టర్ ఫేమస్ లోగో బ్లూ బర్డ్ తీసివేసి దాని స్థానంలో కుక్కను ఉంచడం ఇలా వార్తలు వస్తూనే ఉణ్నాయి. అయితే ట్విటర్ త్వరలో బ్లూటిక్‌ని అన్‌సబ్‌స్క్రయిబ్ అకౌంట్ల నుండి తొలగిస్తుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి, ఇప్పుడు దాని తేదీ కూడా తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని మస్క్ ట్వీట్ ద్వారా ప్రకటించాడు, ఏప్రిల్ 20 నుంచి బ్లూ టిక్‌ను తొలగిస్తున్నట్లు తెలిపారు. లెగసీ బ్లూ చెక్‌మార్క్‌ను తొలగించడానికి చివరి తేదీ ఏప్రిల్ 20' అని ట్వీట్‌లో రాశారు.

అంటే ట్విట్టర్‌లో బ్లూ టిక్‌లతో లెగసీ వెరిఫైడ్ ఖాతాలు ఉన్న వ్యక్తులు బ్లూ టిక్‌ను ఉంచడానికి చెల్లించాల్సి ఉంటుంది. మస్క్ ప్రకారం, ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ట్విట్టర్ బ్లూకు సబ్‌స్క్రైబ్ చేయబడిన బ్లూ టిక్‌లు ఆ ఖాతాలకు మాత్రమే ఉంటాయి. Twitter బ్లూ ధర ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉంది. భారతదేశంలో దీని ధర రూ. 650-900 గా ఉంది. ఏప్రిల్ 1 నుండి లెగసీ వెరిఫైడ్ ఖాతాల నుండి బ్లూ చెక్-మార్క్ బ్యాడ్జ్‌ని  తొలగించడం ప్రారంభిస్తామని, సబ్‌స్క్రైబ్ చేసిన ఖాతాలకు మాత్రమే బ్లూ చెక్ ఉంటుందని ట్విట్టర్ గతంలో ప్రకటించింది.

ఇంతకుముందు  ట్విట్టర్ రాజకీయ నాయకులు, నటులు, జర్నలిస్టులతో సహా ప్రముఖుల ఖాతాలకు బ్లూ టిక్‌లను ఇచ్చేది. దాని కోసం ఎటువంటి ఖర్చు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అలన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పటి నుండి, దానిలో చాలా మార్పులు వచ్చాయి. Twitter యొక్క లెగసీ బ్లూ చెక్ అనేది కంపెనీ పాత వెరిఫికేషన్ మోడల్. ఈ నమూనా కింద, ప్రభుత్వాలు, కంపెనీలు, బ్రాండ్‌లు, సంస్థలు, వార్తా సంస్థలు, పాత్రికేయులు, వినోదం, క్రీడలు,  గేమింగ్, కార్యకర్తలు, నిర్వాహకులు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తుల ఖాతాలు వెరిఫై చేసేవారు. ప్రారంభంలో ఇది US, UK, కెనడా, ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌లలో ప్రారంభించబడింది. దీని తర్వాత భారతదేశంలో కూడా ప్రారంభించారు.అంటే ఏప్రిల్ 20 నుండి వారి ఖాతాల నుండి ట్విటర్ బ్లూ టిక్ వేస్తామని ప్రకటించారు. 

ఇప్పుడు మూడు రకాల టిక్‌లు అందుబాటులో ఉన్నాయి:
గతంలో ట్విట్టర్‌లో ధృవీకరించబడిన ఖాతాలకు బ్లూ టిక్‌లు మాత్రమే ఇవ్వబడ్డాయి. అయితే ఇప్పుడు కంపెనీ మూడు రకాల మార్కులు ఇస్తోంది. ట్విట్టర్ ప్రభుత్వ సంబంధిత ఖాతాలకు గ్రే టిక్‌లు, కంపెనీలకు గోల్డెన్ టిక్‌లు మరియు ఇతర వెరిఫైడ్ ఖాతాలకు బ్లూ టిక్‌లు ఇస్తోంది.

PREV
click me!

Recommended Stories

Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెటల్ ఏది? ధర తెలిస్తే షాక్ అవుతారు
Post office: మీ డ‌బ్బులే డ‌బ్బుల‌ను సంపాదిస్తాయి.. ఈ స్కీమ్‌తో ప్రతీ నెల మీ అకౌంట్లోకి మనీ వచ్చేస్తాయ్