
ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ ఈ ఏడాది చివర వరకు పూర్తవనుంది. అయితే ఇప్పుడు ఉన్న సీఈవో పరాగ్ అగర్వాల్‌పై ఆయన కన్నుపడింది. ఆయన పోస్ట్ బూస్టింగ్ చేయాలని అనుకుంటున్నారు. అంతేకాదు కొత్త సీఈవోను కూడా వెతికారు. మస్క్ ట్విట్టర్ కొనుగోలుతో ఉద్యోగుల్లో కూడా కొంత భయం ఉంది. తమ జాబ్స్ ఎక్కడ పోతాయోనని ఆందోళన చెందారు.
అంతేకాదు సీఈవో పరాగ్ అగర్వాల్ కూడా ఉద్యోగాల తొలగింపు అంశంపై స్పందించారు. పలు ప్రశ్నలను సంధించారు. భవిష్యత్‌లో ట్విట్టర్ ఎలా ఉండబోతుందనే అంశంపై కూడా ఆందోళన చెందారు. ఉద్యోగుల తొలగింపు అంశం అగ్గిరాజేసింది. అయితే ఇప్పటికైతే జాబ్స్ తీయడం ఉండదని.. భయపడొద్దని పరాగ్ ధైర్యం చెప్పారు. అయితే రాయిటర్ వార్తా సంస్థ మాత్రం సంచలన విషయం రిపోర్ట్ చేసింది.
ఇప్పుడు ఉన్న చైర్మన్ బ్రెట్ టేలర్‌కు సరైనన మేనెజ్ మెంట్ లేదని.. మార్చాల్సిన అవసరం ఉందని హింట్ ఇచ్చారు. గత నవంబర్‌లో జాక్ డోర్సీ నుంచి అగర్వాల్ సీఈవో బాధ్యతలు చేపట్టారు. మస్క్ చేతికి పగ్గాలు వచ్చేవరకు అగర్వాల్ పదవీ బాధ్యతలను చేపడతారు. తాను ట్విట్టర్ కొనుగోలు చేస్తే.. అగర్వాల్‌ను తీసివేస్తానని ఇదివరకే మస్క్ ప్రకటించారు. కంపెనీలో ఎక్కువ జీతాలు ఉన్నవారిని కూడా తొలగించాలని మస్క్ అనుకుంటున్నారు. లీగల్ హెడ్ విజయ గద్దెన కూడా తప్పించాలని భావిస్తున్నారని సమాచారం. ఈ మేరకు న్యూ యార్క్ పోస్ట్ తెలిపింది. గద్దెకు 12.5 మిలియన్ డాలర్ల ప్యాకేజీ.. ట్వీట్టర్ షేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు 17 మిలియన్ డాలర్లు ఏడాదికి సంపాదిస్తోంది. కంపెనీలో హైయస్ట్ పెయిడ్ ఉద్యోగి కావడంతో.. ఆమెకు మంగళం పాడాలని అనుకుంటున్నారు.
ప్రస్తుతం ఎలాన్ మస్క్ కన్ను భారత సంతతికి చెందిన విజయ గద్దెపై పడింది.ట్విట్టర్ లీగల్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న. విజయకు ఏడాదికి 17 మిలియన్ డాలర్ల వేతనాన్ని సంస్థ చెల్లిస్తోంది.తద్వారా ట్విట్టర్‌లో అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా ఆమె నిలిచిన సంగతి తెలిసిందే. 48 ఏళ్ల విజయ గద్దె గత వారం ట్విట్టర్ భవిష్యత్తు గురించి సహోద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ కంటతడి పెట్టారు.2020 అధ్యక్ష ఎన్నికల్లో హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్ గురించి ప్రత్యేక కథనాన్ని వ్రాసిన న్యూయార్క్ పోస్ట్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసినందుకు గాను విజయ గద్దెను ఎలాన్ మస్క్ బహిరంగంగానే విమర్శించారు.
కాగా. 2011లో ట్విట్టర్‌లో చేరిన విజయ క్రమంగా టీమ్ లీడర్‌గా ఎదిగారు. ట్విట్టర్‌లో భద్రతాపరమైన నిర్ణయాలు, విధానాలను రూపొందిస్తున్నారు. 350 మంది పనిచేసే ట్విట్టర్ లీగల్ పాలసీ అండ్ సేఫ్టీ విభాగానికి విజయ నాయకత్వం వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ట్విట్టర్‌లో పోస్టయ్యే వ్యాఖ్యానాలు, వీడియోలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఈ విభాగానిదే. ట్విట్టర్‌లో చేరకముందు జూనిపర్ నెట్‌వర్క్స్, విల్సన్ సోన్సినీ గుడ్‌రీచ్ అండ్ రోసాటి సంస్థలకు న్యాయ సేవలందించారు విజయ. ఇక గత దశాబ్ధ కాలంగా ట్విట్టర్ తీసుకున్న నిర్ణయాల వెనుక ఆమె కీలక పాత్ర పోషించారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రకటనలను అమ్మకూడదని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీని ఒప్పించడంలో గద్దె విజయ క్రియాశీలకంగా వ్యవహరించారు.