ట్విట్టర్ దెబ్బకు మస్క్ ఆరోగ్యం మటాష్, పనిలో పడి 13 కేజీలు బరువు కోల్పోయిన కుబేరుడు..

Published : Nov 17, 2022, 12:34 PM IST
ట్విట్టర్ దెబ్బకు మస్క్ ఆరోగ్యం మటాష్, పనిలో పడి 13 కేజీలు బరువు కోల్పోయిన కుబేరుడు..

సారాంశం

ట్విట్టర్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి  ఎలాన్ మస్క్ రేయింబవళ్ళు కష్టపడుతున్నారు.  దీంతో అతని హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతోంది. అంతే కాదు ఏకంగా 13 కేజీల బరువును కూడా కోల్పోయారు.   

ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఎలాన్  మస్క్ కంపెనీని రీసెట్ చేయడానికి పగలు,  రాత్రి శ్రమిస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు, అలాగే పెయిడ్ సర్వీసులతో కాస్త గందరగోళం అయినప్ప్పటికీ, ట్విట్టర్ రీసెట్ పనుల్లో ఎలాన్  మస్క్ చాలా అలసిపోయాడు. ఈ ప్రపంచ కుబేరుడు పనిలో పడి తన బరువును 13 కిలోలు కోల్పోయాడు. ట్విట్టర్‌లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అతను ఈ విషయం చెప్పారు.

ఇటీవల, ఒక యూజర్ ట్విట్టర్‌లో కొనసాగుతున్న మేనేజ్ మెంట్ మార్పు గురించి ఎలాన్  మస్క్‌ని ఒక ప్రశ్న అడిగారు. దానికి అతను "పూర్తిగా... ఉదయం నుండి రాత్రి వరకు, వారంలో ఏడు రోజులు" పని చేస్తున్నాను అని బదులిచ్చారు.

ట్విట్టర్ యూజర్ ప్రశ్నకు ఎలాన్ మస్క్ ఫన్నీ సమాధానం
చికాగో అనే ట్విటర్ యూజర్ ఇలా వ్యాఖ్యానించారు, "మీరు చాలా బరువు తగ్గారు, ఎలాన్  మీ పనిని కొనసాగించండి! ” దానికి మస్క్, "30 పౌండ్లు కోల్పోయాను!" దీనికి కారణం ఏమిటని అడిగితే, “ఉపవాసం, రుచికరమైన ఆహారం లేకపోవడం వల్ల ఇది జరిగిందని మస్క్ బదులిచ్చాడు.

మరొక యూజర్ మస్క్‌ను మీకు మధుమేహం ఉందా అని అడిగాడు. దానికి బదులిస్తూ “నేను డయాబెటిస్‌కు కూడా ఓజెంపిక్ తీసుకుంటాను. అని తెలిపారు. 

చాలా సార్లు బరువు తగ్గడం గురించి మాట్లాడతారు
మస్క్ తన బరువు తగ్గడం గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా, ఓ స్నేహితుడి సలహా మేరకు డైటింగ్ పాటించడం ద్వారా బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించినట్లు మస్క్ వెల్లడించారు.

అతని తండ్రి ఎర్రోల్ మస్క్ తన కొడుకు  "చెడు ఆహారపు అలవాట్లను" పలుమార్లు విమర్శించారు. తన కొడుకు గార్సినియా కాంబోజియా అనే బరువు తగ్గించే మాత్రను తీసుకోవాలని సిఫారసు చేసాడు, ఇది అతనికి కొన్ని పౌండ్లు తగ్గడానికి సహాయపడిందని పేర్కొన్నాడు. తన తండ్రి మాట విన్న తర్వాత, మస్క్ తన బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించాడు కానీ మాత్రలు తీసుకోవడం లేదు. 

ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ పని మొదలు పెట్టినప్పటి, నుంచి ట్విట్టర్ హెడ్ క్వార్టర్ లోనే నిద్రిస్తున్నట్లు గతంలో ఒక ట్వీట్ చేశాడు. తాను నిద్రపోను ఉద్యోగులను కూడా నిద్రపోనివ్వను అంటూ  భీష్మ శపథం చేశాడు.  అయితే అనుకుంటున్నట్లు ట్విట్టర్ రీసెట్ చేయడం అంత సులభం కాదని ఇప్పటికే తేలింది.  బ్లూటిక్ విషయంలో మస్క్ తీసుకున్న నిర్ణయం వల్ల భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 

బ్లూ టిక్  పెయిడ్ సర్వీస్ ఫలితంగా గా, నకిలీ గాళ్లు కూడా డబ్బు చెల్లించి ప్రముఖ బ్రాండ్ల పేరుతో అకౌంట్లను స్టార్ట్ చేసేశారు.  దీంతో అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లకు పెద్ద దెబ్బ తగిలింది. చివరకు  మస్క్ ఆధ్వర్యంలో నడిచే  tesla,  స్పేస్ ఎక్స్ వంటి పేజీలకు కూడా నకిలీ పేజీలు తయారవడంతో మస్క్ కు ఎదురు దెబ్బ తగిలింది. దెబ్బకు బ్లూటిక్ పెయిడ్ సర్వీసును నిలిపివేశారు. 

PREV
click me!

Recommended Stories

Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!
Top 10 Companies : ఇండియాలో టాప్ 10 కంపెనీలు ఇవే... మార్కెట్ క్యాప్‌లో కింగ్ ఎవరు?