పసిడి ధరల పరుగులు.. నేడు తులం బంగారం ధర ఎంత పెరిగిందంటే..? కొత్త ధరలు తెలుసుకోండి..

Published : Nov 17, 2022, 09:30 AM IST
 పసిడి ధరల పరుగులు.. నేడు తులం బంగారం ధర ఎంత పెరిగిందంటే..? కొత్త ధరలు తెలుసుకోండి..

సారాంశం

ఒక నివేదిక ప్రకారం, గురువారం ప్రారంభ ట్రేడ్‌లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధరతో పోల్చితే నేడు రూ. 200 పెరిగి రూ. 48,000 వద్ద, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్నటి ధరతో పోలిస్తే రూ.210 పెరిగి రూ.52,360 వద్ద ట్రేడవుతోంది. 

ఈ నెల, డిసెంబర్‌లో పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరోసారి బులియన్ మార్కెట్‌లో సందడి నెలకొంది. సాధారణంగా ఇండియాలో మహిళలు ఎక్కువగా బంగారాన్ని కొనేందుకు ఇష్టపడుతుంటారు. అంతేకాదు ప్రతి శుభకార్యాలకు, పండుగలకు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.

ఒక నివేదిక ప్రకారం, గురువారం ప్రారంభ ట్రేడ్‌లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధరతో పోల్చితే నేడు రూ. 200 పెరిగి రూ. 48,000 వద్ద, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్నటి ధరతో పోలిస్తే రూ.210 పెరిగి రూ.52,360 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ.700 తగ్గి కిలోకి రూ.62,000 వద్ద ఉంది.

పూణెలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.48,030గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,390గా ఉంది. నాగ్‌పూర్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 48,030 మరియు 24 క్యారెట్ల బంగారం 52,390. 

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో రూ.48,150, బెంగళూరులో రూ.48,050, చెన్నైలో రూ.49,700గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, ముంబైలో  రూ.48,000గా ఉంది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో  రూ.52,510, బెంగళూరులో రూ.52,410, చెన్నైలో రూ.54,210గా ఉంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ముంబై,  కోల్‌కతాలో రూ.52,360గా ఉంది.

స్పాట్ బంగారం 2:08 pm ET (1908 GMT) నాటికి ఔన్స్‌కు 0.3% తగ్గి $1,773.13డాలర్లకి చేరుకుంది, అయితే US గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 0.1% తగ్గి $1,775.8డాలర్లకి చేరాయి.

వెండి ఔన్స్‌కు 0.6% తగ్గి $21.41డాలర్లకి, ప్లాటినం 1.2% తగ్గి $1,002.47డాలర్లకి, పల్లాడియం 1.1% పడిపోయి $2,075.55డాలర్లకి చేరుకుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.52 వద్ద ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.62,000గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో 1 కేజీ వెండి ధర రూ.68,500గా ఉంది. అయితే బంగారం, వెండి ధరలు  రాష్ట్రాలు, ప్రాంతాల పరిస్థితులు, స్థానిక పన్ను రేట్లు,  మేకింగ్ ఛార్జీలను బట్టి మారుతుంటాయి.   

PREV
click me!

Recommended Stories

Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!