తెలంగాలోని వైద్యులు, నర్సులు, ఆశా వంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో సహా హెల్త్‌కేర్ వర్క్‌ఫోర్స్ పనితీరును మెరుగుపరిచేందుకు ECHO ఇండియాతో చేసుకున్న ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని డాక్టర్ శశికళ పాల్కొండా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలోనే పురాతన వైద్య కళాశాలల్లో ఒకటైన ఉస్మానియా మెడికల్ కాలేజ్, ECHO ఇండియాతో చేతులు కలిపింది. ఈ ఒఫ్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని వైద్యులు, అలాగే ఆరోగ్య కార్యకర్తల సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ భాగస్వామ్య ఒప్పందంపై ఉస్మానియా మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ శశికళ పాల్కొండ రెడ్డి, ECHO ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ (కల్నల్) కుముద్ రాయ్ సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శశికళ పాల్కొండా రెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా మెడికల్ కాలేజీ వైద్యులకు క్లినికల్ మెడిసిన్‌లో నైపుణ్యం అందించేందుకు ఈ ఒప్పందం కృషి చేస్తుందన్నారు. అలాగే వైద్యులు, నర్సులు, ఆశా వంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో సహా హెల్త్‌కేర్ వర్క్‌ఫోర్స్ పనితీరును మెరుగుపరిచేందుకు ECHO ఇండియాతో చేసుకున్న ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ECHO మోడల్ ఆల్ టీచ్ ఆల్ లెర్న్' ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించుకోవడం ద్వారా,వైద్య విధానంలో అనేక సవాళ్లను అధిగమించగలమని నమ్ముతున్నాను, డాక్టర్ శశికళ తెలిపారు.
undefined
అంతేకాదు కళాశాల క్యాంపస్‌లో అన్ని సౌకర్యాలతో కూడిన టెలిమెంటరింగ్ హబ్‌ను ఏర్పాటు చేసినందుకు డాక్టర్ శశికళ ఎకో ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ హబ్ వివిధ వ్యాధులపై మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందించడానికి ఉపయోగిస్తామన్నారు. రోగుల భద్రతను మెరుగుపరచడానికి, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సిబ్బందిని మెరుగుపరచడానికి టెలిమెంటరింగ్ హబ్ ఉపయోగపడుతుందన్నారు.
ECHO ఇండియా చైర్మన్ డాక్టర్ (కల్నల్) కుముద్ రాయ్ మాట్లాడుతూ, ఉస్మానియా మెడికల్ కాలేజీ వైద్యులు వైద్య నిపుణులకు అకడమిక్స్, క్లినికల్ రీసెర్చ్ మెడికల్ ప్రాక్టీస్‌లో నైపుణ్యం సాధించే అవకాశాలను అందించడంలో ముందంజలో ఉన్న ఒక అత్యున్నత సంస్థ అని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో తమ భాగస్వామ్యం చాలా దూరం వెళ్తుందని నేను నమ్ముతున్నాను అని పేర్కొన్నారు.
ECHO ఇండియా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సందీప్ భల్లా మాట్లాడుతూ, ECHO దేశంలోనే నాణ్యమైన ఆరోగ్య సేవలను అందచేస్తోందని, ECHO మోడల్ ఆరోగ్య సంరక్షణ నిపుణులు - డాక్టర్లు, నర్సులు కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల అన్ని కేడర్‌లకు కేస్-బేస్డ్ లెర్నింగ్‌ను అందిస్తుందన్నారు. ముఖ్యంగా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించే వారి సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీతో భాగస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో ECHO ఇండియా విస్తరణను ప్రోత్సహిస్తుందని డాక్టర్ భల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.