Closing Bell: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్, బ్యాంక్ షేర్ల బూస్ట్‌తో 445 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ముగింపు

Published : Mar 21, 2023, 04:38 PM IST
Closing Bell: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్, బ్యాంక్ షేర్ల బూస్ట్‌తో 445 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ముగింపు

సారాంశం

అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ పాలసీ కీలక వడ్డీ రేట్ల పెంపు విషయంలో విరామం పాటిస్తుందనే వార్తలతో  భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు, పాజిటివ్ గా ముగిశాయి. సెన్సెక్స్ 445.73 పాయింట్లు పెరిగి 58,074.68 వద్ద, నిఫ్టీ 119.10 పాయింట్లు పెరిగి 17,107.50 వద్ద  ముగిశాయి.

మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ బలపడ్డాయి. సెన్సెక్స్ దాదాపు 450 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ కూడా 17000 దాటింది. నేటి ట్రేడింగ్ లో మిశ్రమ ధోరణి కనిపించింది. నిఫ్టీలో బ్యాంక్, ఫైనాన్షియల్ ఇండెక్స్‌లో 1 శాతం కంటే ఎక్కువ లాభం కనిపించింది. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియాల్టీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ సిగ్నల్స్ పాజటివిటీ కారణంగా సోమవారం అమెరికన్ మార్కెట్లలో బూమ్ ఉంది, ఈ రోజు ప్రధాన ఆసియా మార్కెట్లలో కొనుగోళ్లు జరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 446 పాయింట్ల లాభంతో 58075 వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్లు బలపడి 17107 వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో హెవీవెయిట్ స్టాక్‌లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ 30కి చెందిన 19 స్టాక్స్ గ్రీన్ మార్క్‌లో, 11 రెడ్ మార్క్‌లో ముగిశాయి. నేటి టాప్ గెయినర్స్‌లో రిలయన్స్, బాజ్‌ఫినాన్స్, యాక్సిస్‌బ్యాంక్, టైటాన్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. టాప్ లూజర్లలో HINDUNILVR, TECHM, TECHM, TCS, INFY, HCLTECH, ITC ఉన్నాయి.

అదానీ గ్రూప్ షేర్లలో జోష్..

అదానీ గ్రూప్ షేర్లు  రోజు అంటే మార్చి 21న  మరోసారి బూమ్‌ను చూస్తున్నాయి. వారంలో రెండో ట్రేడింగ్ రోజున అదానీ గ్రూప్ షేర్లు గ్రీన్ మార్క్‌లో ట్రేడయ్యాయి. నేడు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ విల్మార్ లిమిటెడ్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ లాభాలతో ముగిశాయి. 

ఉదయం 11 గంటల నుంచే, అదానీ ఎంటర్‌ప్రైజెస్  షేర్లు 19.05 పాయింట్లు అంటే 1.06% లాభంతో రూ.1,824.00 దగ్గర ట్రేడయ్యింది. అదే సమయంలో, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ ధర ఉదయం 11 గంటలకు 39.60 పాయింట్లు అంటే 4.67% లాభంతో రూ.888.25 వద్ద ట్రేడయ్యింది. ఉదయం 11 గంటలకు అదానీ పోర్ట్స్ 0.15%, అదానీ ట్రాన్స్‌మిషన్ 1.05%, అదానీ టోటల్ గ్యాస్ 3.15%, అదానీ విల్మార్ లిమిటెడ్ 0.89%, అదానీ పవర్ 2.13%, NDTV 0.15%, ACC 1.23%, అంబుజా సిమెంట్ 1.3 శాతం లాభపడ్డాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Today Gold Rate in Hyderabad: ఉగాది గుడ్‍న్యూస్...తగ్గిన బంగారం, వెండి ధరలు, ఎంతో తెలుసా?
High Court: ఒక్కడే కూర్చుని అడల్ట్ సైట్‌లు చూస్తున్నారా.! హైకోర్టు ఏం చెప్పిందంటే.?