కరోనా ఎఫెక్ట్: ఎయిర్ ఇండియా విమానాలు 15 రోజులు నిలిపివేత

By Sandra Ashok KumarFirst Published Sep 18, 2020, 12:10 PM IST
Highlights

ఇండియా నుండి ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ కి వెళ్లిన ఒక ప్రయాణీకుడికి కోవిడ్-19కు పాజిటివ్ రావడంతో దుబాయ్ ఎయిర్ పోర్ట్ గట్టిగా హెచ్చరించింది. గత రెండు వారాల్లో ఇలా వైరస్ సోకిన ప్రయాణీకుడిని గుర్తించకపోవడం రెండవసారని ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ కి మళ్ళీ కరోనా వైరస్ సెగ తగిలింది. హైదరాబాద్ నుండి దుబాయ్‌కు వెళ్ళే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్  విమానాలను సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 3 వరకు అంటే 15 రోజుల పాటు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తాత్కాలికంగా నిషేధించింది.

ఇండియా నుండి ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ కి వెళ్లిన ఒక ప్రయాణీకుడికి కోవిడ్-19కు పాజిటివ్ రావడంతో దుబాయ్ ఎయిర్ పోర్ట్ గట్టిగా హెచ్చరించింది. గత రెండు వారాల్లో ఇలా వైరస్ సోకిన ప్రయాణీకుడిని గుర్తించకపోవడం రెండవసారని ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

దుబాయ్‌కు వచ్చిన కరోనా వైరస్ రోగుల అన్ని వైద్య, నిర్బంధ ఖర్చులను భరించాలంటూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు జరిమానా విధించింది. ప్రాయనికుడి వద్ద కోవిడ్ -19 పాజిటివ్ టెస్ట్ రిపోర్టులు ఉన్నప్పటికీ దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సెప్టెంబర్ 18 నుంచి 15 రోజుల పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను నిలిపివేసింది.

యుఎఇ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారతదేశం నుండి ప్రయాణించే ప్రతి ప్రయాణీకుడి ప్రయాణానికి 96 గంటల ముందు చేసిన ఆర్టి-పిసిఆర్ టెస్ట్ ఒరిజినల్ కరోనా వైరస్-నెగటివ్ సర్టిఫికేట్ తప్పని సరిగా ఉండాలి.

also read 

"కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న ప్రయాణీకుడు  విమానంలో ఉన్న ఇతర ప్రయాణీకులను ప్రమాదంలో పడేసాడు. అలాగే వారు తీవ్రమైన ఆనారోగ్యనికి గురికావడానికి కూడా కారణమయ్యాడు.

కరోనా వైరస్ మహమ్మారి సమయంలో దుబాయ్ విమానాశ్రయాలకు వచ్చే విమాన ప్రయాణాలకి సంబంధించిన కరోనా వైరస్ విధానాలను ఎయిర్ ఇండియా ఉల్లంఘిస్తోందని " అని దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. 

"దుబాయ్ విమానాశ్రయాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అన్ని ఆపరేషన్లు తాత్కాలికంగా నిషేధం  సెప్టెంబర్ 18 శుక్రవారం 00:01 గంటల నుండి అక్టోబర్ 2వ తేదీ 23:59 గంటల వరకు నిషేధం అమలులో ఉంటుంది" అని తెలిపింది.

దుబాయ్‌కి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల పున ప్రారంభం కోసం, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా నిరోధించడానికి వివరణాత్మక చర్య లేదా విధానాన్ని సమర్పించాలని ఎయిర్ ఇండియాను దుబాయ్ విమానాశ్రయలు అభ్యర్థించారు.
 

click me!