మార్చి 31వ తేదీ లోపు ఈ పనులు చేయకపోతే భారీగా నష్టపోయే చాన్స్..వెంటనే చెక్ చేసుకోండి..

Published : Mar 08, 2023, 03:51 PM IST
మార్చి 31వ తేదీ లోపు ఈ పనులు చేయకపోతే భారీగా నష్టపోయే చాన్స్..వెంటనే చెక్ చేసుకోండి..

సారాంశం

భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 31తో ముగస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కొన్ని ఆర్థిక పనులను పరిష్కరించాల్సి ఉంటుంది. మార్చి 31లోపు మీరు ఏఏ పనులు పూర్తిచేయాలో తెలుసుకుందాం. తద్వాారా భారీ పెనాల్టీల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 

బ్యాంకులు, ఇతర సంస్థల ఉద్యోగులు మార్చి నెల వచ్చిందంటే చాలు.  చాలా బిజీ అయిపోతుంటారు. ఇక  సామాన్యులది కూడా దాదాపు అదే పరిస్థితి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 చివరి రోజు.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా పాన్ ఆధార్ లింక్ చేయడం, పన్ను ప్రణాళిక, అనేక ఇతర ముఖ్యమైన పనుల కోసం గడువు మార్చి 31తో ముగుస్తుంది. అంతకు ముందు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటో తెలుసుకుందాం.

ఆధార్- పాన్ కార్డ్ లింకింగ్
ఆధార్ పాన్ లింకింగ్ విషయానికి వస్తే.. టైం ఉంటే రేపు చేసుకోవచ్చు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆధార్ పాన్ కార్డ్ లింక్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ. గడువులోగా లింక్ చేయని PAN కార్డ్‌లు 1 ఏప్రిల్ నుండి  పనిచేయవు. పాన్ కార్డ్ చెల్లని పక్షంలో మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయలేరు.

పన్ను ఆదా చేసే పెట్టుబడులు
2022-2023 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను ఉపశమనం పొందేందుకు వివిధ పెట్టుబడులు పెట్టే వారికి కూడా మార్చి 31 చివరి తేదీ . మీరు మార్చి నెలాఖరులోపు PPF, సుకన్య సమృద్ధి యోజన, ELSS వంటి పథకాలలో పెట్టుబడి పెట్టినట్లయితే, మీకు పన్ను మినహాయింపులు లభిస్తాయి.  

ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ కూడా మార్చి 31వ తేదీ కావడం విశేషం. 2019-20 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్- 2020-21) సవరించిన రిటర్న్‌లను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 31. అంతేకాకుండా, 2022-2023 ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్ , చివరి వాయిదా చెల్లించడానికి చివరి తేదీ 15 మార్చి 2023. ఈ తేదీలోపు పన్ను చెల్లింపుదారు ముందస్తు పన్ను బాధ్యతను పూర్తిగా చెల్లించడంలో విఫలమైతే ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం జరిమానా విధించబడుతుంది.

ప్రధాన మంత్రి వయ వందన యోజన
PM వయ వందన యోజనలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి ఉన్నవారు మార్చి 31, 2023 లోపు అప్లై చేసుకోవడం ప్రారంభించాలి. ఈ 10 సంవత్సరాల పథకంలో, పెట్టుబడిదారులు 7.4 శాతం చొప్పున పెన్షన్ పొందుతారు. ఈ పథకం కింద రూ. 1,000 నుండి రూ. 9,250 వరకు నెలవారీ పింఛను పొందే అవకాశం ఉంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే