మీ పిల్లలు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారా.. సేవ్ చేయడం ఇలా నేర్పించాలి..?

By Ashok kumar SandraFirst Published Apr 10, 2024, 6:45 PM IST
Highlights

పిల్లలు సాధారణంగా చాక్లెట్లు, బొమ్మలు మొదలైన వాటి కోసం డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ డబ్బు విలువ తెలిస్తే అనవసరంగా ఖర్చు పెట్టరు. అయితే  పిల్లలకు డబ్బు ఆదా చేయడం నేర్పాలంటే ఏం చేయాలి..?  
 

పిల్లల మొండితనం గురించి అందరికీ తెలిసిందే. పిల్లలు తమకు కావలసినది పొందే వరకు వదిలిపెట్టరు. తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉందా లేదా అని ఆలోచించరు. తమకు కావాల్సినవి కొనిచ్చేదాకా పట్టుబడుతుంటారు. కొనకపోతే ఏడ్చి ఏడ్చి తినకుండా మారం చేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే పిల్లలకు చిన్నతనం నుంచే డబ్బు విలువ నేర్పించాలి. డబ్బు విలువ తెలిస్తే పిల్లలు అనవసరంగా ఖర్చు చేయరు. అయితే పిల్లలకు డబ్బు ఆదా చేయడం నేర్పాలంటే ఏం చేయాలి..? డబ్బు ఆదా చేయడం ఎలా ? ఎలా సంపాదించాలి..? 

చాలా మంది తల్లిదండ్రులు  పిల్లలు అడిగినవి కొని ఇస్తారు. ఎవరైనా డబ్బు విలువ చెప్పినా ఇప్పుడు అవసరం లేదు పెద్దయ్యాక నేర్చుకుంటారు అని అంటుంటారు. కానీ పిల్లలు పెద్దయ్యాక డబ్బు ఆదా చేయడం ఎలాగో నేర్చుకోవడం అంత సులభం కాదు. చిన్నప్పటి నుంచి కొంచెం పాటిస్తే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.

అవసరమైనవి ఇంకా  అవసరం లేనివి
పిల్లలకు సేవింగ్స్  విలువను నేర్పడంఎంలో  మొదటి మెట్టు అవసరమైనవి ఇంకా  అనవసరమైన వాటి మధ్య తేడా వారికి నేర్పడం. ఫుడ్, ఇల్లు, దుస్తులు, ఆరోగ్యం, విద్య వంటి ప్రాథమిక విషయాలపై ఖర్చు చేయాలి. సినిమాలు, గాడ్జెట్లు, ఖరీదైన బట్టలు అనవసరమైన విషయాలపై కాదు. ఈ విషయాన్ని మాటల్లో చెప్పకుండా, మీ ఇంట్లో ఉన్న వస్తువులను వారికి చూపించి.. అర్థమయ్యేలా చెప్పాలి. 

 చిన్న పిల్లలకు ఇంట్లో కొన్ని  చిన్న చిన్న పనులు చేయటం అలవాటు  చేస్తూ కావలసినప్పుడు  అవసరమైన డబ్బు ఇవ్వాలి. తద్వారా కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేయాలో  పిల్లలకు తెలుస్తుంది. అలా కష్టపడి సంపాదించిన డబ్బు వృధా ఖర్చు చేయకూడదని కూడా అర్థమవుతుంది.

సేవింగ్స్  ప్లాన్స్  
పిల్లలు పొదుపుగా  మారాలని మీరు కోరుకుంటే, డబ్బు సంపాదించడానికి,  ఆదా చేయడానికి వారిని సహకరించడం ముఖ్యం. పాకెట్ మనీ ఇస్తే దాచుకోమని చెప్పండి. మీరు ఎక్కువ ఖర్చు చేయకుండా డబ్బు ఆదా చేసినప్పుడు మీరు వారికి మంచి గిఫ్ట్  ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల డబ్బు ఆదా చేయడంపై ఆసక్తి పెరుగుతుంది. 

సేవ్ చేయడానికి ఒక ప్లేస్ అందించండి
పిల్లలకు సేవింగ్స్  టార్గెట్,  ఎలా సేవ్  చేయాలి,  చిన్న పిల్లలు ఉన్నట్లయితే పిగ్గీ బ్యాంక్ బెస్ట్  అప్షన్. పిల్లలు పెద్దవారైతే వారికి స్వంత సేవింగ్స్  అకౌంట్  బ్యాంకులో తెరవవచ్చు.

ఖర్చులను ట్రాక్ చేయడం 
డబ్బు ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవడం మంచి సేవింగ్స్ ప్లాన్స్ లో ముఖ్యమైన భాగం. బ్యాంక్ లేదా డెబిట్ కార్డ్ యాప్‌తో ఖర్చులను ట్రాకింగ్ చేయడం కొంచెం ఈజీ. ఇంకా వారి ఖర్చులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి.

click me!