తాజాగా కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు మద్దతుగా డీమార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమానీ రూ. 155 కోట్ల విరాళం ప్రకటించారు. వీటిలో రూ. 100 కోట్లు పీఎం కేర్స్ ఫండ్‌కు మిగతా రూ. 55 కోట్లను 11 రాష్ట్రాలకు అందజేయనున్నట్లు వెల్లడించారు.
న్యూఢిల్లీ: పంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటున్న కరోనా వైరస్ మహమ్మారి పై భారతదేశ ప్రభుత్వం కఠినమైన చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లక్ డౌన్ కూడా ప్రకటించింది. కరోనా వైరస్ బారిన పడిన వారి కోసం ఒక వైపు విరాళాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు మద్దతుగా డీమార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమానీ రూ. 155 కోట్ల విరాళం ప్రకటించారు. వీటిలో రూ. 100 కోట్లు పీఎం కేర్స్ ఫండ్‌కు మిగతా రూ. 55 కోట్లను 11 రాష్ట్రాలకు అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఇందులో తెలంగాణకు రూ. 5 కోట్లు, ఏపీకి రూ. 5 కోట్లు ఇవ్వనున్నారు. అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం పీఎం కేర్స్ ఫండ్‌కు అందజేస్తామని ప్రకటించింది. అలాగే సేవా కార్యక్రమాల కోసం మరో రూ. 4 కోట్లు ఇస్తామని, తమ సంస్థ ఉద్యోగులు మరో రూ. 4 కోట్లు ఇవ్వనున్నారని చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు.
ఇంకా సీకే బిర్లా గ్రూప్ రూ. 35 కోట్ల విరాళం ప్రకటించింది. రూ. 25 కోట్లను పీఎం కేర్స్ ఫండ్‌కు, మిగతా రూ. 10 కోట్లు వైద్య పరికరాలు, మాస్కులు, పీపీఈలు కొనడానికి రాష్ట్రాలకు అందజేస్తామని పేర్కొంది.
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 5.65 కోట్లు విరాళం ఇచ్చింది. నెస్లే ఇండియా రూ. 15 కోట్ల విరాళం ప్రకటించింది. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ రూ. 5 కోట్ల విరాళం ఇచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రి హీరోలు కూడా విరాళాలు ఇచ్చిన సంగతి మీకు తెలిసిందే.