సామాన్యుడికి షాకిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. బడ్జెట్ తరువాత నేడు మళ్ళీ పెంపు..

By S Ashok KumarFirst Published Feb 4, 2021, 11:48 AM IST
Highlights

ఢీల్లీ, ముంబైలలో పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలతో పాటు విదేశీ మారక ద్రవ్యాల రేటును బట్టి ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.  

గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను నేడు రాష్ట్ర చమురు కంపెనీలు సవరించాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఇంధన ధరలు పెరగడం ఇదే తొలిసారి. నేడు, డీజిల్ ధర 35 నుండి 37 పైసలకు పెరిగగా, పెట్రోల్ ధర కూడా 35 పైసలు పెరిగింది.

ఢీల్లీ, ముంబైలలో పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలతో పాటు విదేశీ మారక ద్రవ్యాల రేటును బట్టి ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.  

 ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉంది.

నగరం        డీజిల్    పెట్రోల్
ఢీల్లీ             76.83    86.65
కోల్‌కతా       80.41    88.01
ముంబై        83.67     93.20
చెన్నై          82.04    89.13
ఇండోర్         84.93    94.62
హైదరాబాద్  83.81   90.10 

బడ్జెట్‌లో ఇంధనంపై అగ్రి సెస్సు విధించిన నేపథ్యంలో పెట్రోల ధరలపై చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అగ్రి సెస్‌ ప్రభావం  వినియోగదారుల మీద ఉండదని స్పష్టం చేశారు.

పెట్రోల్, డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గిస్తున్నామని కాబట్టి, వినియోగదారులపై అగ్రి సెస్ సంబంధిత అదనపు భారం పడదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చినా, పెటట్రోల్‌ ధరలు  మరింత భారం కావాడం వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది.

 కాగా బడ్జెట్‌లో పెట్రోల్ మీద రూ.2.50, డీజిల్ మీద 4 రూపాయల చొప్పున అగ్రి ఇన్‌ఫ్రా సెస్ విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ప్రతిరోజూ  ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలు మారుతుంటాయి. ఇంధన ధరలలో ఏదైనా మార్పులు ఉంటే కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.
 

click me!