స్టాక్ మార్కెట్: రికార్డు స్థాయిలో ప్రారంభమైన తరువాత నేడు స్వల్పంగా క్షీణించిన సెన్సెక్స్-నిఫ్టీ

Ashok Kumar   | Asianet News
Published : Feb 03, 2021, 11:41 AM IST
స్టాక్ మార్కెట్: రికార్డు స్థాయిలో ప్రారంభమైన తరువాత  నేడు స్వల్పంగా క్షీణించిన సెన్సెక్స్-నిఫ్టీ

సారాంశం

బడ్జెట్ ప్రవేశపెట్టిన తరుణంలో స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. దీంతో గత రెండు రోజులుగా సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ముగిశాయి.  

ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2021-22 దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తరుణంలో స్టాక్ మార్కెట్ ఊపందుకుంది.

దీంతో గత రెండు రోజులుగా సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ముగిశాయి.  గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 3,511 పాయింట్లు పెరిగింది. నేడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్   ఇండెక్స్ సెన్సెక్స్ 227.66 పాయింట్లు (0.46 శాతం) పెరిగి 50,025.38 స్థాయిలో ప్రారంభమైంది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 75.50 పాయింట్లుతో (0.52 శాతం) లాభంతో  14,723.35 వద్ద ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో ప్రారంభించిన తరువాత ప్రాఫిట్ -బుకింగ్ సెన్సెక్స్-నిఫ్టీ పడిపోవడానికి దారితీసింది. 

ఉదయం 9.20 నిమిషాలకు 138.82 పాయింట్ల నష్టంతో  సెన్సెక్స్ 49,658.90, నిఫ్టీ 36 పాయింట్లు తగ్గి 14611.90 వద్ద ట్రేడవుతోంది.

ఉదయం 9.29 నిమిషాలకు 138 పాయింట్లు పడిపోయిన తర్వాత స్టాక్  మార్కెట్  తిరిగి  సెన్సెక్స్ 80,22 పాయింట్లు (0.16 శాతం) పెరిగి, 49877,94 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ  11.25 పాయింట్లు పెరిగి 14659.10 వద్ద ఉంది.

ఉదయం 10.9 నిమిషాలకు  బిఎస్ఇ సెన్సెక్స్ 257,12 పాయింట్లు పొంది మళ్ళీ 50 వేల పైన 50054,84 చేరుకుంది. నిఫ్టీ  92.10 పాయింట్ల లాభంతో 14739.95 వద్ద ట్రేడవుతోంది.

ఈ రోజు ప్రారంభ వాణిజ్యంలో యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డి, ఒఎన్‌జిసి, ఐఓసి షేర్లు గ్రీన్ మార్క్ మీద ఉండగా  శ్రీ సిమెంట్, ఎస్‌బిఐ, హిండాల్కో, టిసిఎస్, యుపిఎల్ షేర్లు రెడ్ మార్క్ మీద ప్రారంభమయ్యాయి.
 
 నేడు   గ్రీన్ మార్క్ మీద ప్రారంభమయిన వాటిలో బ్యాంకులు, ఫైనాన్స్ సర్వీసెస్, లోహాలు, ఫార్మా, ఆటో, ప్రైవేట్ బ్యాంకులు, ఐటి, పిఎస్‌యు బ్యాంకులు, ఎఫ్‌ఎంసిజి, మీడియా, రియాల్టీ ఉన్నాయి.

 సెన్సెక్స్ ఉదయం 9.02 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో 326.48 పాయింట్లు (0.66 శాతం) 50124.20 వద్ద ఉంది. నిఫ్టీ 82.90 పాయింట్లు (0.57 శాతం) పెరిగి 14730.80 వద్ద ఉంది.  

గత ట్రేడింగ్ రోజున సెన్సెక్స్ 751.66 పాయింట్లు (1.55 శాతం) పెరిగి 49452.27 వద్ద ఉంది. అలాగే నిఫ్టీ 199.40 పాయింట్ల లాభంతో 14480.60 స్థాయిలో ప్రారంభమైంది.

మంగళవారం ట్రేడింగ్ తర్వాత, సెన్సెక్స్ 1197.11 పాయింట్లతో (2.46) శాతం 49797.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 366.65 పాయింట్ల (2.57 శాతం) లాభంతో 14647.85 వద్ద ముగిసింది. 
 

PREV
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు