
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ వారంలో రెండో రోజైన మంగళవారం, మార్కెట్ ప్రీ-ఓపెనింగ్ గ్రీన్ మార్క్‌లోనే సూచీలు కనిపించినప్పటికీ, నిఫ్టీ స్వల్ప లాభాలతో 17,120 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.బీఎస్ఈ సెన్సెక్స్ కూడా 57,297.57 స్థాయి వద్ద ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 20 పాయింట్లు జంప్ చేసి 57,305 స్థాయికి చేరుకుంది.
అయితే మార్కెట్ ప్రారంభమైన వెంటనే లాభాలు కనుమరుగై మార్కెట్ గ్రాఫ్ ఎర్రబడింది. 9.30 వద్ద వద్ద, సెన్సెక్స్ నిన్నటితో పోలిస్తే 221 పాయింట్లు పడిపోయి 57,071 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. నిఫ్టీ కూడా 57 పాయింట్లు పతనమై 17,059 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం 11 గంటలకు సెన్సెక్స్ 255 పాయింట్లు పతనమై 57,061 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీ 69 పాయింట్లు పతనమై 17,048 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ టాప్ గెయినర్లుగా ONGC, Indian Oil Corp, Reliance Inds, Bharat Petroleum, Power Grid ట్రేడవుతున్నాయి. నిఫ్టీ టాప్ లూజర్లుగా Hindustan Unilever, Nestle India, Britannia, Asian Paints, Grasim ట్రేడవుతున్నాయి.
సెక్టార్ పరంగా చూసినట్లయితే ఐటీ, ఎనర్జీ మినహా నిఫ్టీకి చెందిన అన్ని సెక్టార్ల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ ఏకంగా 1 శాతం పైగా నష్టపోయింది. అలాగే నిఫ్టీ ఆటో సూచీ 0.85 శాతం నష్టపోయింది. ఫార్మా 0.44 శాతం నష్టపోయింది. FMCG సూచీ సైతం 1.97 శాతం నష్టపోయింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సహా భారత స్టాక్ మార్కెట్‌కు ప్రపంచ మార్కెట్ల సంకేతాలన్నీ చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగే దేశీయ మార్కెట్లలో చమురు ధరలు పెరగుదల సైతం ప్రభావం చూపిస్తోంది.