మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యం అనుమతి..

By Sandra Ashok KumarFirst Published Aug 20, 2020, 6:54 PM IST
Highlights

 కొన్ని నివేదికల ప్రకారం ఆదాయం వంటి విషయాలని దృష్టిలో ఉంచుకుని తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యం సేవించడానికి అవసరమైన అనుమతులు జారీ చేయాలని ఢీల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎక్సైజ్ విభాగాన్ని ఆదేశించారు.

న్యూ ఢీల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో అన్‌లాక్ 3 ప్రక్రియ మొదలైంది. తాజాగా రెస్టారెంట్లు, హోటళ్లకు వచ్చే కస్టమర్లకు, హోటళ్ల గదుల్లో మద్యం సేవించడానికి ప్రభుత్వం గురువారం అనుమతి ఇచ్చింది.

అయితే ఇది మన రాష్టంలో కాదు దేశ రాజధాని ఢిల్లీలో. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్ 3.0 మార్గదర్శకాల ప్రకారం దేశ రాజధాని నగరంలోని బార్‌లు ఎప్పటిలాగే మూసివేసి ఉంటాయని తెలిపింది. జూన్ 8 నుండి కేంద్రం, ఢీల్లీ ప్రభుత్వం హోటళ్ళు, రెస్టారెంట్లను తిరిగి తెరవడానికి అనుమతించగా, మద్యం సేవించడం నిషేధించింది.

కొన్ని నివేదికల ప్రకారం ఆదాయం వంటి విషయాలని దృష్టిలో ఉంచుకుని తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యం సేవించడానికి అవసరమైన అనుమతులు జారీ చేయాలని ఢీల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎక్సైజ్ విభాగాన్ని ఆదేశించారు.

"హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్‌లాక్ మార్గదర్శకాల నిబంధనల ప్రకారం బార్లు ఎప్పటిలాగే మూసివేయబడతాయి. అయితే, అస్సాం, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలతో సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు రెస్టారెంట్లు, క్లబ్బులు, హోటల్ గదులలో ఎక్సైజ్ నిబంధన ప్రకారం లైసెన్స్ హోల్డర్లచే మద్యం సేవించడానికి అనుమతి ఇచ్చాయి.

రెవెన్యూ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని లైసెన్ పొందిన హోటల్ గదులలో, రెస్టారెంట్లలో, క్లబ్‌లలో మద్యం సేవించడానికి ఎక్సైజ్ విభాగం అవసరమైన అనుమతి ఇచ్చింది ”అని సిసోడియా సంతకం చేసిన ఉత్తర్వులలో  ఉంది. ఢీల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డిడిఎంఎ) నగరంలో హోటళ్ళు, వీకెండ్ మార్కెట్లను ప్రారంభించడానికి అనుమతి ఇచ్చిన ఒక రోజు తర్వాత ఈ చర్య వచ్చింది.

also read యస్ బ్యాంకు కుంభకోణం: వాధవాన్ సోదరులకు హైకోర్టు బెయిల్ మంజూరు ...

ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఢీల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ నగరంలో హోటళ్లు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు, ఇది దేశ రాజధానిలో పర్యాటక పునరుద్ధరణ, ఆతిథ్య కార్యకలాపాల పునరుద్ధరణకు ముందడుగు అని అన్నారు.

హోటల్, రెస్టారెంట్ కార్యకలాపాలను ప్రారంభించడానికి అనుమతి కోసం ఢీల్లీలోని హాస్పిటాలిటీ పరిశ్రమ డిమాండ్లను అంగీకరించమని ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఎల్-జితో చర్చించారని కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పర్యాటక రంగంలో హోటల్, రెస్టారెంట్, హాస్పిటాలిటీ సేవలను జూన్ 8 నుంచి దశలవారీగా ప్రారంభించడానికి హోంమంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.

హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర వసతి విభాగాల కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎస్‌ఓ‌పిలు, ప్రోటోకాల్లను జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న భద్రతా ప్రోటోకాల్స్, సామాజిక దూరం నిబంధనలను అనుసరించడం ద్వారా డైనింగ్ హాల్స్, కాన్ఫరెన్స్ సౌకర్యాలు వారి సామర్థ్యంలో 50 శాతం పనిచేయడానికి అనుమతించాలని పటేల్ హోం మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.

ఇదిలావుండగా ఢీల్లీ హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ (డిహెచ్‌ఆర్‌ఓఓ) అధ్యక్షుడు లవ్లీన్ ఆనంద్, చైర్మన్ సందీప్ ఖండేల్వాల్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు.
 

click me!