వాహనదారులకు గుడ్ న్యూస్: డీజిల్ పై లీటర్‌కు రూ.8.36 తగ్గింపు..

By Sandra Ashok KumarFirst Published Jul 30, 2020, 4:10 PM IST
Highlights

మరో పక్క పెట్రోల్ కంటే తక్కువగా ఉండే డీజిల్ ధర తాజాగా పెట్రోల్ ధరలను మించి రికార్డు నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకి గుడ్ న్యూస్, ఏంటంటే డీజిల్‌పై వ్యాట్‌ను 30 శాతం నుంచి 16.75 శాతానికి తగ్గించాలని ఢీల్లీ కేబినెట్ గురువారం నిర్ణయించింది. 

న్యూ ఢీల్లీ: జూన్ 7 నుంచి లాక్ డౌన్ సడలింపుతో ఇంధన ధర ధరలు వాహనదారులకి చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుతుండటంతో తార స్థాయికి చేరుకున్నాయి. మరో పక్క పెట్రోల్ కంటే తక్కువగా ఉండే డీజిల్ ధర తాజాగా పెట్రోల్ ధరలను మించి రికార్డు నమోదు చేసింది.

దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకి గుడ్ న్యూస్, ఏంటంటే డీజిల్‌పై వ్యాట్‌ను 30 శాతం నుంచి 16.75 శాతానికి తగ్గించాలని ఢీల్లీ కేబినెట్ గురువారం నిర్ణయించింది. ఢీల్లీలో డీజిల్ ధరను 82 రూపాయల నుండి 73.64 రూపాయలకు తగ్గింది, అంటే లీటరుకు 8.36 రూపాయలు తగ్గనుంది.

కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వర్చువల్ సమావేశంలో ఈ నిర్ణయం వెల్లడైంది.  'ఈ చర్య ఢీల్లీ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో సహాయపడుతుంది' అని అన్నారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం తీవ్రమైన సవాలుగా ఉందని, అయితే ప్రజల సహకారంతో దీనిని సాధించవచ్చని ఆయన అన్నారు.

also read 

డీజిల్ ధరను తగ్గించాలని నగర వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు. ఇంధన ధర తగ్గడంతో ఢీల్లీలో డీజిల్ చౌక ధరకే లభించనుంది. రాజస్థాన్‌లో లీటరు డీజిల్ ధర రూ .82.64, మధ్యప్రదేశ్‌లో రూ .81.29, మహారాష్ట్రలో రూ .79.81, ఛత్తీస్ ఘడ్ లో ఒక లీటరు డీజిల్‌కు రూ .79.68 చెల్లించాల్సి ఉండగా, గుజరాత్‌లో ఒక లీటరు డీజిల్ ధర రూ .79.05.


కోవిడ్-19 నివేదికలు  ప్రతికూలంగా ఉన్న రోగులపై ఆర్‌టి-పి‌సి‌ఆర్ (రియల్ టైమ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్) పరీక్ష చేయడం గురించి ప్రభుత్వ మార్గదర్శకాన్ని ఖచ్చితంగా పాటించాలని నిన్న కేజ్రీవాల్ నగర అధికారులను ఆదేశించారు.

దేశ రాజధానిలో కోవిడ్-19 బెడ్స్ పెంచడానికి ఆసుపత్రులతో సంబంధాలు పెట్టుకున్న హోటళ్లను కూడా ఢీల్లీ ప్రభుత్వం డీలింక్ చేసింది. కేంద్రపాలిత ప్రాంతంలోని కోవిడ్-19 రోగుల సంఖ్యను తగ్గించే దృష్టిలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

click me!