Daily Hunt: VerSe Innovation సంస్థ రికార్డు.. 805 మిలియన్ డాలర్ల సమీకరణ..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Apr 06, 2022, 10:43 AM ISTUpdated : Apr 06, 2022, 10:48 AM IST
Daily Hunt: VerSe Innovation సంస్థ రికార్డు.. 805 మిలియన్ డాలర్ల సమీకరణ..!

సారాంశం

భవిష్యత్తులో నిధులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సామర్థ్యాలను (ML), లైవ్ స్ట్రీమింగ్, వెబ్ 3.0 వంటి కొత్త టెక్నాలజీ ప్రయోగాలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తామని కంపెనీ ప్రకటించింది.  

ప్రముఖ న్యూస్ అగ్రిగేటర్ Dailyhunt, షార్ట్ వీడియో యాప్ Josh పేరెంట్ కంపెనీ అయిన VerSe Innovation స్వల్పకాలంలోనే వృద్ధిలో దూసుకుపోతోంది. 5 బిలియన్ల డాలర్ల విలువతో తాము 805 మిలియన్ డాలర్లను సమీకరించినట్లుగా తాజాగా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల కొద్ది నెలలుగా టెక్నాలజీ స్టాక్‌లు ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ పెట్టుబడిదారుల నుంచి మద్దతు ఉందని పేర్కొంది. 

భవిష్యత్తులో ఈ నిధులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ సామర్థ్యాలను (ML), లైవ్ స్ట్రీమింగ్, వెబ్ 3.0 వంటి కొత్త టెక్నాలజీ ప్రయోగాలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ప్రయోగాలతో సంస్థ లోకల్ పోటీదారులైన షేర్ చాట్ వంటివాటితో సహా అంతర్జాతీయ పోటీదారులైన Instagram, YouTube వంటి వాటితో పోటీ పడగలదు.

ఒక ఇండియన్ స్టార్టప్ ఈ స్థాయిలో నిధులు సమీకరించడంలో ఈ ఏడాదికి ఇదే తొలిస్థానంలో ఉన్నట్లయింది. డైలీ హంట్ 805 మిలియన్ డాలర్లతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉండగా.. స్విగ్గీ (Swiggy) 700 మిలియన్లతో రెండో స్థానంలో ఉంది. పాలిగాన్, బైజుస్, యూనిఫోర్ వంటి స్టార్టప్‌లు 400 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. డైలీ హంట్ దేశవ్యాప్తంగా దాదాపు 350 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. వీడియో యాప్ జోష్ ప్లాట్‌ఫామ్ 150 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. ఈ నెల నుండి ఈ ప్లాట్‌ ఫామ్‌ను మానిటైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, పబ్లిక్‌ వైబ్ 5 మిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల వినియోగదారులతో కూడిన హైపర్‌లోకల్ వీడియో ప్లాట్‌ఫామ్‌గా ఉంది.

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు