
ఉత్తరప్రదేశ్ అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది యోగి సర్కార్. ఇందులో భాగంగానే ఎంతో నిబద్ధతతో రాష్ట్రంలోని సాంప్రదాయ కళలు, చేతిపనుల వారికి ఆదుకునేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముందుకు వచ్చారు. ఇప్పటికే ఒడిఒపి (One District One Product) పథకం ద్వారా కళాకారులు, హస్తకళాకారులను గుర్తించి వారికి అన్ని రకాల సహాయసహకారాలు అందించడానికి ప్రణాళికలు రూపొందించింది ప్రభుత్వం.
అయితే ఇవాళ (మంగళవారం) విశ్వకర్మ జయంతి సందర్భంగా లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్టాన్ వేదికగా ఒడిఒపి, మాతృకళ పథకాల కింద హస్తకళాకారులకు ₹50,000 కోట్ల విలువైన రుణాలను, విశ్వకర్మ శ్రామ్ సమ్మాన్ అవార్డులను, టూల్ కిట్‌లను అందజేయనున్నారు. జూపిటర్ హాల్‌లో సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ పంపిణీ కార్యక్రమం, రాష్ట్రంలోని సాంప్రదాయ కళలను ప్రోత్సహించడంతో పాటు కళాకారులు, హస్తకళాకారులను సత్కరించడానికి దోహదపడుతుంది.
ఉత్తరప్రదేశ్‌లో సాంప్రదాయ కళలను కాపాడుకోవడమే కాకుండా వాటిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించడంలో సీఎం యోగి ముందుంటున్నారు. అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఒడిఒపి (ODOP) కార్యక్రమం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది.
ఈ కార్యక్రమం రాష్ట్రంలోని సాంప్రదాయ కళలకు మంచి వేదికను కల్పించింది, ఒడిఒపి ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్నాయి. వివిధ రంగాలలోని కళాకారులు, హస్తకళాకారులకు సముచిత గుర్తింపు, ప్రోత్సాహం లభించేలా సీఎం యోగి నిరంతర ప్రయత్నం చేస్తున్నారు.