Latest Videos

చంద్రబాబు మనవడా మజాకా.. తొమ్మిదేళ్లకే కోటీశ్వరుడు..

By Ashok kumar SandraFirst Published Jun 13, 2024, 9:59 AM IST
Highlights

హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబానికి దాదాపు 35.7 శాతం వాటా ఉంది. కంపెనీలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి నాయుడుకు 24.37 శాతం, కుమారుడు నారా లోకేష్‌కు 10.82 శాతం, కోడలు బ్రాహ్మణికి 0.46 శాతం, మనవడు దేవాన్ష్‌కు 0.06 శాతం వాటా ఉంది. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయనతో సంబంధమున్న కంపెనీ కూడా వార్తల్లోకెక్కింది. రాష్ట్ర ఎన్నికల విజయం తర్వాత ఏపి సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ షేర్స్  ధర భారీగా పెరిగింది. దీంతో 9 ఏళ్ల చంద్రబాబు మనవడు దేవాన్ష్ నాయుడు కూడా కోటీశ్వరుడయ్యాడు. దేవాన్ష్ నాయుడు తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధర పెరగడం వల్ల మల్టీ మిలియనీర్ అయ్యాడు.

హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబానికి దాదాపు 35.7 శాతం వాటా ఉంది. కంపెనీలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి నాయుడుకు 24.37 శాతం, కుమారుడు నారా లోకేష్‌కు 10.82 శాతం, కోడలు బ్రాహ్మణికి 0.46 శాతం, మనవడు దేవాన్ష్‌కు 0.06 శాతం వాటా ఉంది. గత 12 ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేరు ధర దాదాపు రెండింతలు పెరిగింది. దీంతో వారి షేర్ల విలువ కూడా రెట్టింపు అయింది. ఈ కంపెనీ షేరు ధర మే 13న రూ.363.05 కాగా, ప్రస్తుతం రూ.660.30గా ఉంది. అంటే నెల రోజుల్లోనే షేరు ధర 297.25 రూపాయలు పెరిగింది.

కంపెనీలో 56,075 షేర్లు దేవాన్ష్ నాయుడుకి ఉన్నాయి. వాటి విలువ జూన్ 3న రూ.2.4 కోట్ల నుంచి రూ.4.1 కోట్లకు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ధర పెరగడంతో చంద్రబాబు  నాయుడు కుటుంబ సంపద రూ.1,225 కోట్లు పెరిగింది. హెరిటేజ్ గ్రూప్‌ను 1992లో చంద్రబాబు నాయుడు స్థాపించారు. ఈ కంపెనీ పెరుగు, నెయ్యి, జున్ను, పాలు వంటి అనేక ఉత్పత్తులను విక్రయిస్తుంది. హెరిటేజ్ ఫుడ్స్ ఉత్పత్తులను 11 రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు.  
 

click me!