అటల్ పెన్షన్ యోజనను కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ప్రైవేట్, ఆన్ ఆర్గనైజేడ్ రంగాల కార్మికులకు పెన్షన్ అందేలా ఈ పథకం తీసుకొచ్చారు.
పదవీ విరమణ(retirement) అనేది ఒకరు పని చేయలేనప్పుడు విశ్రాంతి తీసుకొనే వారికి ప్రతినెల ఆదాయాన్ని అందిస్తుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందుతుండగా, ఆన్ ఆర్గనైజేడ్ రంగానికి చెందిన ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పేరుతో పింఛను పథకాన్ని అమలు చేస్తోంది.
అటల్ పెన్షన్ యోజనను కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ప్రైవేట్, ఆన్ ఆర్గనైజేడ్ రంగాల కార్మికులకు పెన్షన్ అందేలా ఈ పథకం తీసుకొచ్చారు. ఈ పథకంలో చేరిన కార్మికులు నెలకు గరిష్టంగా రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. అదే సమయంలో కనీస పెన్షన్ మొత్తం హామీ కూడా అందించబడుతుంది. అంటే రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000, రూ.5000 ఇలా ప్రతినెల పెన్షన్ పొందవచ్చు.
భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. అయితే భారతీయ పౌరుడి వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అటల్ పెన్షన్ యోజన పథకం కింద ఒక పేరు మీద ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయబడుతుంది. జాతీయ బ్యాంకులన్నీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. కాబట్టి, మీరు నేరుగా మీ బ్యాంకు అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు. మీకు బ్యాంక్ అకౌంట్ లేకుంటే, మీరు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ తెరవాలి లేదా పోస్టాఫీసులో అకౌంట్ తెరిచిన తర్వాత ఈ పథకంలో చేరవచ్చు. రిజిస్ట్రేషన్ ఫారమ్‌లు ఆన్‌లైన్‌లో ఇంకా బ్యాంకు శాఖలలో అందుబాటులో ఉంటాయి.
అవసరమైన డాకుమెంట్స్ మీ మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ ఫోటో కాపీ. మీ దరఖాస్తు ఆమోదించిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు కన్ఫర్మేషన్ SMS పంపబడుతుంది. మీరు అటల్ పెన్షన్ యోజనలో నమోదు చేసుకునే వయస్సు మీద ఆధారపడి మీ పెన్షన్ ఉంటుంది.
18 ఏళ్ల వయసులో అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన వ్యక్తి 60 ఏళ్ల వరకు నెలకు రూ.210 డిపాజిట్ చేయాలి. అంటే రోజుకు రూ.7 ఆదా చేయాలి. మీ వయస్సు 60 ఏళ్ల తర్వాత, పదవీ విరమణ సమయంలో మీకు నెలకు రూ.5,000 పెన్షన్ లభిస్తుంది.
అటల్ పెన్షన్ యోజన అనేది జీవితకాల పెన్షన్ పథకం. పెన్షనర్ మరణిస్తే అతని జీవిత భాగస్వామికి పెన్షన్ వస్తుంది. ఇద్దరూ చనిపోతే నామినీకి డబ్బు వస్తుంది. ఈ పథకం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందుతుందని గమనించాలి.