ఆండ్రాయిడ్ 13 వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్...మీ ఫోన్లు హ్యాకింగ్ గురయ్యే ప్రమాదం..పరిష్కారం ఇదే..

By Krishna Adithya  |  First Published Aug 14, 2023, 5:21 PM IST

ఆండ్రాయిడ్ 13కు సంబంధించినటువంటి ఫోన్లలో పలు భద్రతా లోపాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ CERT-In హెచ్చరించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమైన సమాచారం వినియోగదారులతో పంచుకుంది. మీ ఫోన్లు హ్యాకింగ్ బారిన గురికాకుండా జాగ్రత్తలు కూడా ప్రకటించింది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా సైబర్ దాడులకు గురవుతున్నాయి. ఫలితంగా మీ బ్యాంకింగ్ అకౌంట్లోనే డబ్బులు సైతం మాయమైపోతున్నాయి.  అంతేకాదు మీ పర్సనల్ డేటా,  అలాగే ఫోటోలు వీడియోలు వంటివి కూడా హ్యాకర్లకు చిక్కుతున్నాయి. ఇలాంటి సమస్యలకు  ప్రధాన కారణం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లోపాలే ప్రధాన కారణం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఆండ్రాయిడ్ 13కు సంబంధించి పలు భద్రతా లోపాలు ఉన్నట్లు కేంద్ర టెక్నాలజీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. 

కొత్తగా వచ్చినటువంటి ఆండ్రాయిడ్ 13 వెర్షన్ కు సంబంధించి ప్రభుత్వం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ సాఫ్ట్ వేర్ లో పలు లోపాలు ఉన్నాయని ఎత్తి చూపింది.  ఆండ్రాయిడ్ 13  ఫోన్లు ముఖ్యంగా  హ్యాకర్ల  దాడికి గురయ్యే అవకాశం పుష్కలంగా ఉందని పేర్కొంది. దీనికి సంబంధించి యూజర్లు జాగ్రత్త తీసుకోవాలని భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే Computer Emergency Response Team (CERT-In) ఆండ్రాయిడ్ 13 కు సంబంధించి మన హెచ్చరికలు జారీ చేసింది.  

Latest Videos

ముఖ్యంగా ఈ ఆపరేటింగ్ సిస్టంలో మల్టిపుల్ లోపాలు ఉన్నట్లు గుర్తించింది.  తద్వారా సైబర్  దాడులకు గురయ్యే అవకాశం  అధికంగా ఉన్నట్లు CERT-In  పేర్కొంది.  ఈ సైబర్ దాడుల్లో భాగంగా మీ పర్సనల్ డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని కూడా పేర్కొంది. CERT-In సంస్థ  మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పని చేస్తుంది. . ఈ సంస్థ సైబర్ సెక్యూరిటీ కి సంబంధించినటువంటి అనేక అంశాలపై పరిశోధనలు చేస్తుంది.  పౌరులకు సైబర్ భద్రతకు సంబంధించి హామీ ఇస్తుంది.

అయితే CERT-In  జారీ చేసినటువంటి ఈ హెచ్చరికల్లో కేవలం ఈ లోపాలు ఆండ్రాయిడ్ 13 లో మాత్రమే పరిమితం కాలేదు.  10, 11, 12, 12L  ఆపరేటింగ్ సిస్టం లలో సైతం లోపాలు ఉన్నట్లు గుర్తించింది. 

ఎలాంటి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. 

>> హ్యాకర్ల ద్వారా దోపిడీకి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని CERT-In సంస్థ సూచించింది. 

>> ముఖ్యంగా హ్యాకర్లు పాస్‌వర్డ్‌లు, ఫోటోలు, ఆర్థిక డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేసే వీలు కలుగుతుంది. 

>> మీ ఫోన్ ను నిరుపయోగంగా చేస్తుంది

మీ Android ఫోన్ ఎలా రక్షించుకోవాలి

మీ Android పరికరాలను సురక్షితంగా ఉంచడానికి, ఈ ప్రమాదాలను తగ్గించడానికి వినియోగదారులు తమ పరికరాలను వీలైనంత త్వరగా తాజా అప్‌డేట్ చేయాలని CERT-In సిఫార్సు చేస్తోంది. ముఖ్యంగా Google ఇప్పటికే సెక్యూరిటీ ప్యాచ్‌లను విడుదల చేసిందని  CERT-In  . వినియోగదారులు వివరాల కోసం 'Android సెక్యూరిటీ బులెటిన్-ఆగస్టు 2023'ని తనిఖీ చేయవచ్చని తెలిపింది.

click me!