బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలు..

Ashok Kumar   | Asianet News
Published : Sep 10, 2020, 12:22 PM ISTUpdated : Sep 10, 2020, 11:16 PM IST
బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలు..

సారాంశం

ఇక కస్టమర్ల ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలను పొందే సౌలభ్యాన్నికేంద్రం తీసుకొస్తుంది. దేశవ్యాప్తంగా 100 కేంద్రాల్లో నియమించిన ఏజెంట్ల ద్వారా డోర్ స్టెప్ బ్యాంకింగ్  సర్వీసులను కల్పిస్తున్నట్టు ఆర్థిక సేవల కార్యదర్శి చెప్పారు. 

న్యూ ఢీల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డోర్ స్టెప్  బ్యాంకింగ్ సేవలను బుధవారం ప్రారంభించారు. ఇక కస్టమర్ల ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలను పొందే సౌలభ్యాన్నికేంద్రం తీసుకొస్తుంది.

దేశవ్యాప్తంగా 100 కేంద్రాల్లో నియమించిన ఏజెంట్ల ద్వారా డోర్ స్టెప్ బ్యాంకింగ్  సర్వీసులను కల్పిస్తున్నట్టు ఆర్థిక సేవల కార్యదర్శి చెప్పారు. అంతేకాకుండా వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా కస్టమర్లు వారి సర్వీస్ రిక్వెస్ట్ కూడా ట్రాక్ చేయవచ్చు.

ప్రస్తుతం చెక్, డిమాండ్ డ్రాఫ్ట్, పే ఆర్డర్, కొత్త చెక్ బుక్ రిక్విజిషన్ స్లిప్, 15జి లేదా 15హెచ్ ఫారమ్‌, ఐటి లేదా జిఎస్‌టి చలాన్, అక్కౌంట్ స్టేట్మెంట్, చెక్ బుక్ డెలివరీ, డిమాండ్ డ్రాఫ్ట్, పే ఆర్డర్, టర్మ్ డిపాజిట్ స్లీప్ డెలివరీ, టిడిఎస్ డెలివరీ లేదా ఫారం 16 సర్టిఫికేట్ జారీ, ప్రీ-పెయిడ్ ఇన్స్ట్రుమెంట్ డెలివరీ లేదా గిఫ్ట్ కార్డు వంటి   నాన్-ఫైనాన్షియల్ సర్వీసులు మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.

also read బ్యాంక్ కస్టమర్లకు ఫెస్టివల్ ఆఫర్.. ఆ రుణాలపై ప్రాసెసింగ్‌, డాక్యుమెంటేషన్‌ చార్జీలు రద్దు

అక్టోబర్ 2020 నుండి ఈ కొత్త సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఈ సేవలను ప్రభుత్వ రంగ బ్యాంకుల వినియోగదారులు తక్కువ ఛార్జీలతో పొందవచ్చు.

ఈ సేవలు అన్ని కస్టమర్లకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు,  దివ్యాంగులకు ఈ సేవలను సులభంగా పొందవచ్చు, అలాగే వారికి ఇది మరింత ప్రయోజనం కూడా చేకూరుస్తాయి.

PREV
click me!

Recommended Stories

Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !