బ్యాంక్ కస్టమర్లకు ఫెస్టివల్ ఆఫర్.. ఆ రుణాలపై ప్రాసెసింగ్‌, డాక్యుమెంటేషన్‌ చార్జీలు రద్దు..

By Sandra Ashok KumarFirst Published Sep 10, 2020, 11:02 AM IST
Highlights

'ఫెస్టివల్ బొనాంజా ఆఫర్' కింద గృహనిర్మాణ రుణాలు, కారు రుణాలు వంటి కొన్ని వాటిపై  బ్యాంక్ అన్ని ముందస్తు లేదా ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలను మాఫీ చేస్తుంది.

 న్యూ ఢీల్లీ: కోవిడ్ -19 సంక్షోభం కారణంగా పడిపోయిన రుణల డిమాండ్‌ను పెంచేందుకునేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కస్టమర్ల కోసం 'ఫెస్టివల్ బొనాంజా ఆఫర్' ను బుధవారం ప్రారంభించింది.

'ఫెస్టివల్ బొనాంజా ఆఫర్' కింద గృహనిర్మాణ రుణాలు, కారు రుణాలు వంటి కొన్ని వాటిపై  బ్యాంక్ అన్ని ముందస్తు లేదా ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలను మాఫీ చేస్తుంది. "కస్టమర్లు ఈ ఆఫర్‌ను డిసెంబర్ 31, 2020 వరకు పొందవచ్చు.

also read గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా.. ? ...

దేశవ్యాప్తంగా పిఎన్‌బి 10,897 బ్రాంచ్‌ల ద్వారా లేదా డిజిటల్ చానెళ్ల ద్వారా దీనిని పొందవచ్చు" అని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులకు క్రెడిట్ లభ్యతను పెంచడానికి పిఎన్‌బి రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను తగ్గించింది.

"గృహ రుణాలపై, కస్టమర్లు ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీజును చెల్లించనవసరంలేదు అంటే రుణ మొత్తంలో 0.35%, డాక్యుమెంటేషన్ ఛార్జీలతో పాటు గరిష్టంగా రూ. 15,000. కారు రుణాలపై కస్టమర్లు ఇప్పుడు రుణ మొత్తంలో 0.25% వరకు ఆదా చేసుకోవచ్చు "అని పి‌ఎన్‌బి తెలిపింది.

సెప్టెంబరు 1 నుంచి అమలులోకి వచ్చే బ్యాంకు గృహ రుణాలపై 7.10%, కారు రుణాలపై 7.55% చొప్పున వడ్డీ రేటును అందిస్తోంది.

click me!