దేశంలోని యువత వారానికి 70 గంటలు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. అయితే వారానికి 70 గంటల పని సలహాపై కార్డియాలజిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారానికి 70 గంటల పనిపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఇచ్చిన సలహా దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. దేశంలోని యువత వారానికి 70 గంటలు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన ప్రకటనకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రజలు ఇప్పటికే అదనపు పనితో బాధపడుతున్నారని, రోజుకు 12 గంటలు పనిచేస్తే, వ్యక్తిగత జీవితం, అలాగే ఆరోగ్యం రెండూ ప్రమాదంలో పడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పని భారం, కుటుంబ ఒత్తిళ్లు వంటి కారణాలతో యువత చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతున్నారు. రోజుకు సగటున 12 గంటలపాటు పని చేయడం ద్వారా దేశ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలడానికి కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే దేశ ప్రగతిని సాకుగా చూపి కార్పోరేట్ కంపెనీలకు తమ స్వలాభం కోసం ఇలాంటి సలహాలు ఇస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
undefined
"రోజులో 24 గంటలు ఉంటే అందులో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు నిద్ర, ఎనిమిది గంటలు కుటుంబానికి కేటాయించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇందులో ఇప్పటికే ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లేందుకు కనీసం రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయం కేటాయిస్తున్నారని. ఇదంతా చూస్తే దాదాపు 12 గంటలు పని అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆఫీస్ షిఫ్ట్ 12 గంటల పాటు ఉన్నట్లయితే, ఉద్యోగి నిద్రించే సమయం తగ్గిపోతుందని, తద్వారా ఒత్తిడి పెరిగి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యుల హెచ్చరిస్తున్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో, చాలా కంపెనీల యజమాని ఎలోన్ మస్క్ కూడా తన ఉద్యోగులకు ఇలాంటి సలహా ఇచ్చారు. వారానికి 100 గంటలు పని చేయాలని సూచించి షాక్ ఇచ్చాడు. అయితే "పెళ్లి చేసుకోకుండా, పిల్లల్ని కనకుండా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా ఆలోచించకుండా, కంపెనీల లాభాల కోసం జీవిత కాలాన్ని ధార పోయడం తెలివి తక్కువ పని అని నిపుణులు సూచిస్తున్నారు. చివరికి మానవ శరీరం ఒత్తిడి తట్టుకోలేక అనేక జబ్బుల పాలవుతుందని, అందుకే పని, జీవితం రెండింటిని బ్యాలెన్స్ చేసుకోకుండా వృత్తిలో కొనసాగలేమని నిపుణులు సూచిస్తున్నారు.