విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారతీయ కంపెనీలు నేరుగా లిస్టింగ్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం అనుమతి

By Krishna Adithya  |  First Published Nov 1, 2023, 10:14 PM IST

త్వరలోనే భారతీయ కంపెనీలను గ్లోబల్‌గా మార్చేందుకు మోదీ ప్రభుత్వం కొత్త అడుగు వేసింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) ఇటీవల కొన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలను విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్ చేయడానికి అనుమతిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.


ఇకపై విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారతీయ కంపెనీలు నేరుగా లిస్టింగ్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీనికి సంబంధించి కంపెనీ యాక్ట్ కింద సంబంధిత సెక్షన్‌ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్రస్తుతం, స్థానిక కంపెనీలు అమెరికన్ డిపాజిటరీ రసీదులు (ఎడిఆర్‌లు)  గ్లోబల్ డిపాజిటరీ రసీదులు (జిడిఆర్‌లు) ద్వారా విదేశీ సెక్యూరిటీ మార్కెట్స్ నుంచి నిధులు సేకరిస్తున్నాయి. 

అక్టోబర్ 30న మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, "కంపెనీల (సవరణ) చట్టం 2020 (29 ఆఫ్ 2020)లోని సెక్షన్ 1లోని సబ్-సెక్షన్ (2) ద్వారా అందించబడిన అధికారాలను వినియోగించుకుంటూ, కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 30, 2023న ఈ చట్టంలోని సెక్షన్ 5లోని నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీని నిర్దేశిస్తుందని పేర్కొంది. అయితే  విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారతీయ కంపెనీలను నేరుగా లిస్టింగ్ చేసే నియమాలు ఇంకా నిర్ణయించలేదు. 

Latest Videos

నిర్దిష్ట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు తమ సెక్యూరిటీలను విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ చేయడానికి అనుమతిస్తుంది. విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా కంపెనీల లిస్టింగ్‌కు సంబంధించిన నిబంధనలను రూపొందించేందుకు,పలు అంశాలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని అక్టోబర్ 13న ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నడం గమనార్హం. 

జూలై 28న, ఆర్థిక  కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రపంచ మార్కెట్ల నుండి మూలధనాన్ని పొందడంలో సహాయపడటానికి దేశీయ కంపెనీలను విదేశీ ఎక్స్ చేంజీల్లో లిస్టింగ్ చేయడానికి ప్రభుత్వం అనుమతించాలని నిర్ణయించింది. మే 2020లో, కోవిడ్ రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా ఈ చర్యను ప్రకటించారు.

జులై 28న ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, మొదట్లో, అహ్మదాబాద్‌లోని GIFT సిటీలోని అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రంలో కంపెనీలను జాబితా చేయడానికి అనుమతించాలని ప్రణాళిక చేయబడింది ,  తరువాత, వారు పేర్కొన్న ఎనిమిది నుండి తొమ్మిది విదేశీ అధికార పరిధిలో ఏదైనా జాబితా చేయవచ్చు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఇంతకుముందు అటువంటి డైరెక్ట్ లిస్టింగ్‌ని సులభతరం చేసే ఫ్రేమ్‌వర్క్‌ను సిఫార్సు చేసింది ,  ఈ ప్రాంతంలో భవిష్యత్ నియంత్రణకు సెబీ ఫ్రేమ్‌వర్క్ ఆధారం కాగలదని భావిస్తున్నారు.

click me!