
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రుణల తాత్కాలిక నిషేధం కేసులో తాజా అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దెబ్బతిన్న రంగాలకు ఉపశమనం కలిగించేందుకు ఎక్కువ సమయం ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు తెలిపింది. తాత్కాలిక రుణ నిషేధాన్ని ఆరు నెలలకు మించి పొడిగించడం సాధ్యం కాదని ఆర్‌బిఐ అఫిడవిట్‌లో పేర్కొంది.
మారటోరియం వ్యవధి ఆరునెలలకు మించితే మొత్తం చెల్లింపుల తీరు, ప్రక్రియపై ప్రభావం చూపుతుందని ఆర్‌బీఐ తెలిపింది. ఈ చర్య రుణ గ్రహీతలపై ఒత్తిడిని పెంచుతుందని కూడా వాదించింది. వడ్డీ మీద మాఫీ చేయడమే కాకుండా, మరే ఇతర ఊరట కల్పించినా దేశ ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
also read ప్రయాణికుల కోసం రైల్వే టిక్కెట్ బుకింగ్ లో కొత్త మార్పులు.. నేటి నుంచి అమలు.. ...
కోవిడ్-19 కి ముందు రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాలు సంక్షోభంలో పడ్డాయని తెలిపింది. ఈ నేపథ్యంలోఈ రంగ కష్టాలను బ్యాంకింగ్ నిబంధనల ద్వారా పరిష్కరించలేమని తెలిపింది. రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ వివరణ ఇచ్చాయి.
కొత్త అఫిడవిట్‌లో రుణాల పేమెంట్ కోసం రంగాలకు సంబంధించిన పరిస్థితులను నిపుణుల కమిటీ సిఫార్సును ఇప్పటికే పరిశీలించామని, అవసరమైన విధంగా రుణాలను పునర్నిర్మించడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఇస్తున్నట్లు ఆర్‌బిఐ హామీ ఇచ్చింది.
వివిధ రంగాలపై కోవిడ్-19 సంబంధిత ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని, రుణ తాత్కాలిక నిషేధంపై ఇప్పటివరకు జారీ చేసిన నోటిఫికేషన్లు, సర్క్యులర్లను దృష్టిలో ఉంచుకుని రుణ పునర్నిర్మాణంపై కే.వి.కామత్ కమిటీ సిఫార్సులను రికార్డులో ఉంచాలని సుప్రీం కోర్టు కేంద్రం ఆర్‌బిఐని కోరింది.