ప్రయాణికుల కోసం రైల్వే టిక్కెట్ బుకింగ్ లో కొత్త మార్పులు.. నేటి నుంచి అమలు..

By Sandra Ashok KumarFirst Published Oct 10, 2020, 12:34 PM IST
Highlights

రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో ప్రయాణీకుల సమస్యలను తొలగించడానికి టికెట్ రిజర్వేషన్ సంబంధించిన నిబంధనలలో ఇండియన్ రైల్వే మార్పులు చేసింది. ఈ నియమాలు అక్టోబర్ 10 నుండి అంటే నేటి నుంచి అమల్లో ఉంటాయి. 

దసరా, దీపావళి పండుగ సీజన్ ముందు ఇండియన్ రైల్వే  ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త మార్పులు తీసుకొచ్చింది. రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో ప్రయాణీకుల సమస్యలను తొలగించడానికి టికెట్ రిజర్వేషన్ సంబంధించిన నిబంధనలలో ఇండియన్ రైల్వే మార్పులు చేసింది.

ఈ నియమాలు అక్టోబర్ 10 నుండి అంటే నేటి నుంచి అమల్లో ఉంటాయి. చాలా వరకు ప్రయాణికులు టికెట్ రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తుంటారు, కొన్ని సందర్భాల్లో  రిజర్వ్ చేసుకున్నా టికెట్లను క్యాన్సల్ చేసుకుంటుంటారు.

అలా చివరి నిమిషంలో క్యాన్సల్ చేసుకున్నా టికెట్స్  లేదా ఖాళీగా ఉన్న సిట్స్ అత్యవసరంగా ప్రయాణించే వారికి ఉపయోగకరంగా చేసేందుకు ఈ మార్పులు తీసుకొచ్చింది. కొత్త నిబంధన ప్రకారం రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు ట్రైన్ రిజర్వేషన్ చార్ట్ వెల్లడిస్తారు.

also read 

అంటే ప్రయాణికులు ఇప్పుడు రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు కూడా టికెట్లు బుక్ చేసుకోగలుగుతారు. ఇందుకోసం రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెంటర్ (సిఆర్ఎస్) సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేశారు.

ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ రెండవ చార్ట్ రైలు బయలుదేరే 5 నిమిషాల ముందు రెడీ చేస్తారు, మొదటి చార్ట్ నాలుగు గంటల ముందు సిద్ధం  చేస్తారు. ఈ కొత్త సిస్టమ్ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారికి ఎంతో  ప్రయోజనం చేకూరుస్తుంది.

టికెట్ బుకింగ్ ఆన్‌లైన్‌లో అలాగే పిఆర్‌ఎస్ టికెట్ కౌంటర్ల నుండి పొందవచ్చు. ఈ కొత్త మార్పుతో ప్రయాణికులు ఇప్పుడు రైలు బయలుదేరే ముందు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం పొందుతారు. 

click me!