Home Loan: ఉద్యోగం లేదా, సొంత వ్యాపారం ఉన్న వారికి హోం లోన్ కావాలంటే చిట్కా ఇదే...

Published : Mar 06, 2022, 05:17 PM IST
Home Loan: ఉద్యోగం లేదా, సొంత వ్యాపారం ఉన్న వారికి హోం లోన్ కావాలంటే చిట్కా ఇదే...

సారాంశం

Home Loan: నెల నెలా జీతం పొందే  వేతనజీవులు హోం లోన్, సహా ఇతర లోన్ సదుపాయాల కోసం దరఖాస్తు చేసుకోవడం సులభం. కానీ ప్రొఫెషనల్, సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ ద్వారా వేతనం పొందేవారికి మాత్రం వేతనం లభించడం గృహ రుణం దక్కడం చాలా కష్టం. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే హోం లోన్ పొందడం సులభం అవేంటో చూద్దాం. 

Home Loan: సొంతిల్లు అనేది ప్రతీ ఒక్కరి కల అయితే, ఉద్యోగస్తులు, సాలరీడ్ క్లాస్ కు చెందిన వారికి  గృహ రుణాల చాలా సులభంగా పొందవచ్చు. ప్రతి నెల జీతం పొందే వేతనజీవులు హోం లోన్, సహా ఇతర లోన్ సదుపాయాల కోసం దరఖాస్తు చేసుకోవడం సులభం. దీనికి కారణం లేకపోలేదు. క్యాష్ ఫ్లో, క్రెడిట్ స్కోర్   ఆధారంగా బ్యాంకులు, ఇతర రుణదాతలు వారికి సులభంగా రుణాలు ఇస్తారు.

అయితే, మీరు మీ స్వంత వ్యాపారాన్ని కలిగి ఉంటే, గృహ రుణం (Home Loan) తీసుకోవడం ద్వారా ఇంటిని కొనుగోలు చేయడం మీకు అంత సులభం కాదు. స్వయం ఉపాధి పొందుతున్న వారికి గృహ రుణాలు సులభంగా లభించకపోవడమే ఇందుకు కారణం. సాధారణ నగదు ప్రవాహం (Cash Flow) లేకపోవడం, కొన్నిసార్లు మంచి క్రెడిట్ స్కోర్ లేకపోవడం వల్ల, వారు గృహ రుణం (Home Loan) పొందడం కష్టం.

సాధారణంగా న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు వైద్యులు వంటి నిపుణులను కలిగి ఉంటారు. ఇది కాకుండా, బీమా ఏజెంట్లు, దుకాణదారులు, ఫ్రీలాన్సర్లు మరియు వ్యాపారులు కూడా ఈ వర్గంలోకి వస్తారు.

ఇలా చేస్తే హోం లోన్ సులభం...
జీతభత్యాలతో పోలిస్తే, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు గృహ రుణం పొందడానికి కాస్త ఎక్కువ పత్రాలను అంద చేయాల్సి ఉంటుంది. వీటిలో లీజు ఒప్పందం, ఆదాయపు పన్ను రిటర్న్, ఆస్తుల రుజువు, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి పత్రాలు ఉన్నాయి.

కొన్నిసార్లు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది
చాలా సందర్భాలలో, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు జీతాల కంటే ఎక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందుతారు.  క్రింద పేర్కొన్న కొన్ని దశలను అనుసరించినట్లయితే, మీరు మొత్తం ప్రక్రియను సులభతరం చేయవచ్చు.

డౌన్ పేమెంట్ పెంచండి...
ఎవరైనా ఒక వ్యక్తి అధిక డౌన్ పేమెంట్ చేస్తే, రుణదాత అతని రుణ దరఖాస్తును సులభంగా ఆమోదించవచ్చు. ఎందుకంటే, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, వారు తమ డబ్బును వెనక్కి తీసుకోరు అనే విశ్వాసం రుణదాతలకు ఉంది.

క్రెడిట్ స్కోర్‌ మెయిన్ టెయిన్ చేయండి...
మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడం ద్వారా, మీరు రుణం పొందే అవకాశాలను పెంచుకోవచ్చు. మీరు డబ్బు ఆదా చేసే మీ సామర్థ్యాన్ని కూడా చూపించాలి. ఇది కాకుండా, మీ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లు కూడా ఉండాలి. లేదంటే రుణాన్ని తిరిగి చెల్లించగలిగేంత ఆదాయం మీకు ఉందని మీరు చూపించాలి.

ఆదాయం కంటే తక్కువ రుణం తీసుకోండి
స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు అత్యంత ముఖ్యమైన చిట్కా Debt to Income (DTI) Ratio తక్కువగా ఉంచడం ద్వారా, మీ రుణ దరఖాస్తును ఆమోదించడం రుణదాతలకు సులభం అవుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Gold Price: 2026లో తులం బంగారం ఎంత కానుందంటే.. తెలిస్తే వెంట‌నే కొనేస్తారు