Business Ideas: ఉన్న ఊరిలో కాలు కదపకుండా నెలకు రూ. 1 లక్ష రూపాయలు సంపాదించుకునే చాన్స్..ఎలాగంటే..?

By Krishna Adithya  |  First Published Aug 3, 2023, 12:42 PM IST

వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఓ చక్కటి వ్యాపార ఐడియాతో మీ ముందుకు వచ్చేసాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల ఒక లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


నిరుద్యోగులారా వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి వెంటనే రంగంలోకి దిగండి కేంద్రంలోని మొదటి ప్రభుత్వం మీకు ముద్రా రుణాల పేరిట పెద్ద ఎత్తున రుణాలను అందిస్తోంది సుమారు 50 వేల రూపాయల నుంచి 10 లక్షల వరకు ఈ రుణాలను మీరు పొందే అవకాశం ఉంది ఈ రుణాలపై ఎలాంటి తనఖా కూడా  లేకుండానే రుణాలను అందిస్తున్నారు. బయట ప్రైవేటు వడ్డీలతో పోల్చి చూసినట్లయితే వడ్డీ కూడా చాలా తక్కువే.  ప్రతి నెల సులభ వాయిదాలలో ఈ ముద్రా రుణాలను తీర్చుకునే అవకాశం ఉంది. మీరు కూడా వ్యాపారం చేయాలని భావిస్తున్నట్లయితే వెంటనే మీ దగ్గరలోని ప్రభుత్వ  యాజమాన్యంలోని బ్యాంకు వద్దకు వెళ్లి ముద్ర రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. 

అయితే మీరు బిజినెస్ ప్లాన్ చేసినట్లయితే,  చికెన్ షాప్ పెట్టుకోవడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  ముఖ్యంగా చికెన్ షాప్ అనేది ప్రస్తుత కాలంలో మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ గా అవతరిస్తోంది.  ప్రతి కుటుంబము వారంలో కనీసం ఒక రోజైనా మాంసాహారం తినేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి ఈ నేపథ్యంలో చికెన్ తినేందుకే జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు దీన్ని మనం ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది.  ప్రస్తుతం మార్కెట్లో ఎన్ని చికెన్ షాపులు ఉన్నప్పటికీ,  దాని డిమాండ్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది.  కూరగాయలు కూడా చికెన్ తో సమానంగా పోటీ పడుతూ ఉండటంతో చాలామంది నాన్ వెజ్ తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 

Latest Videos

చికెన్ షాప్ ఏర్పాటు చేసుకోవాలంటే ఫ్రాంచేజీ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవచ్చు.  ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి పలు పౌల్ట్రీ సంస్థలు చికెన్ షాపు ఏర్పాటుకు  ఫ్రాంచేజీలను ఆఫర్ చేస్తున్నాయి.  ఈ సంస్థల నుంచి  ఫ్రాంచేజీ పద్ధతిలో  చికెన్ షాప్ ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే.  అందుకు తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది.  సుమారు రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు ఈ ఫ్రాంచేజీ రుసుము ఉంటుంది. ఫ్రాంచేజీ  పద్ధతిలో మీరు షాపు డిజైన్ అలాగే రెగ్యులర్ గా చికెన్ కూడా సప్లై చేసే వీలుంది.  చికెన్ ప్రాసెసింగ్ కోసం వాడే మెషిన్లు పనిముట్లు కూడా ఫ్రాంచేజీ  సంస్థ వారే అందిస్తారు.  తద్వారా మీకు శ్రమ తగ్గిపోతుంది.  అదనంగా ఫ్రాంచేజీ  సంస్థకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ మీకు తోడవుతుంది.  తద్వారా మీరు కస్టమర్లను ప్రత్యేకంగా వెతుక్కోవాల్సిన పనిలేదు. 

చికెన్ షాప్ తో పాటు కోడిగుడ్లను కూడా అమ్మడం ద్వారా మీరు అదనంగా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది.  అలాగే బిర్యానీ మసాలా,  గరం మసాలా,  అల్లం వెల్లుల్లి పేస్టు వంటివి విక్రయించడం ద్వారా కూడా మీరు అదనంగా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది.  చికెన్ షాప్ ద్వారా మీరు  ప్రతి నెల కనీసం ఒక లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు సంపాదించుకునే వీలుంది.  ఆదివారం పూట చికెన్ తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.  తద్వారా మీరు  మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. 

click me!