Gold Rate: శ్రావణమాసంలో మహిళలకు ఒక గుడ్ న్యూస్ ..బంగారం ధర భారీగా తగ్గిపోతోంది..తులం 55 వేలకు పడిపోయే ఛాన్స్

By Krishna Adithya  |  First Published Aug 3, 2023, 12:16 PM IST

శ్రావణమాసం వచ్చిందంటే లక్ష్మీ కళ వచ్చినట్టే అంటే పసిడి కొనుగోలుకు ఇది మంచి సమయం అని అంతా భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం బంగారం ధర భారీగా తగ్గిపోతుంది దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం.


శ్రావణమాసం వచ్చేస్తోంది.  ఈనెల 18వ తేదీ నుంచి అది నిజ శ్రావణ మాసం ప్రారంభం అవుతుందని పండితులు చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని చాలామంది ఆసక్తిగా ఉంటారు.  అయితే బంగారం కొనుగోలు చేసే వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే పసిడి ధరలు భారీగా తగ్గిపోతున్నాయి.  గడచిన వారం రోజులుగా గమనించినట్లయితే పసిడి ధరలు భారీగా దిగి వచ్చాయి.  ప్రస్తుతం హైదరాబాదు నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,011  రూపాయలుగా నమోదయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55100  రూపాయలుగా నమోదయింది.

ప్రధానంగా అమెరికా మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం వలనే దేశీయంగా కూడా పసిడి ధరలు దిగి వస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం అమెరికా మార్కెట్లో ఒక ఔన్సు అంటే 31 గ్రాముల బంగారం ధర 1968 డాలర్లుగా ట్రేడవుతోంది.  ముఖ్యంగా బంగారం ధరలు  తగ్గడానికి ప్రధాన కారణం. అమెరికాలోని  ఫెడరల్ రిజర్వ్  వడ్డీరేట్లు పెంచడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు.  దీంతో అమెరికా బాండ్ మార్కెట్లో సైతం అమెరికా బాండ్లపై వచ్చే రాబడి కూడా పెరిగింది.  ఫలితంగా మదుపుదారులు తమ డబ్బులను బంగారం బదులుగా అమెరికా బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.  దీంతో ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధరలు తగుముఖం పడుతున్నాయి.  అదే సమయంలో దేశీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 

Latest Videos

ప్రస్తుతం బంగారం ధర 60 వేల రూపాయల సమీపంలో ట్రేడ్ అవుతోంది అయితే,  రాబోయే ఫెస్టివల్ సీజన్ వివాహ సీజన్ కారణంగా మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉందని పసిడి వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  ఇదిలా ఉంటే బంగారం ధరలు తగ్గే కొద్దీ తమకు  కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. 

శ్రావణమాసంలో బంగారం కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.  అయితే శ్రావణ మాసంలో బంగారంకు చాలా డిమాండ్ ఉంటుంది ఈ నేపథ్యంలో దేశీయంగా పసిడి ధరలు తగ్గడం ఒక శుభ పరిణామం అని పసిడివర్తకులు అంటున్నారు.  ఇదిలా ఉంటే అమెరికా  ఫెడరల్ రిజర్వ్ మరోసారి కూడా వడ్డీ రేట్లు పెంచుతుందనే వార్తలు వస్తున్నాయి ఇదే కనుక నిజం అయితే బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.  దీంతో బంగారం ధరలు 55000 సమీపానికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే బంగారం ధర ఈ సంవత్సరం భారీగా హెచ్చుతగ్గులకు గురైంది ఒకానొక దశలో 63 వేల వరకు వెళ్ళింది అక్కడి నుంచి మళ్లీ 60 వేల దిగువకు పడిపోయింది.  ప్రస్తుతం 60 వేల సమీపంలో బంగారం ధర ట్రేడ్ అవుతోంది.  ఈ ధర వద్ద బంగారం కొద్దిరోజుల పాటు స్థిరంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  అయితే అమెరికా డాలర్ విలువ పుంజుకునే కొద్ది బంగారం ధర కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  అయితే ప్రస్తుత రేంజ్ లో బంగారం పై ఇన్వెస్ట్ చేయవచ్చని ధర తగ్గినప్పుడల్లా బంగారం కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

click me!