Business Ideas: కేవలం 10 వేల రూపాయల పెట్టుబడితో, ఇంట్లో కూర్చొనే నెలకు రూ. 1 లక్ష రూపాయలు ఇలా సంపాదించుకోండి..

By Krishna AdithyaFirst Published Aug 8, 2022, 10:17 PM IST
Highlights

సొంతంగా వ్యాపారం చేయాలనేది చాలా మందికి ఒక కల. అయితే అది ఎలా ఉంటుందోనన్న ఆందోళన కూడా ఉంటుంది. అయితే ఉద్యోగాలు స్థిరంగా లేని ఈ రోజుల్లో, వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మీరు ప్రతి సీజన్‌లో డబ్బు సంపాదించే వ్యాపారం కోసం చూస్తున్నట్లయితే,  మీరు కేవలం 10 వేల రూపాయల పెట్టుబడితో ఇంట్లో కూర్చొని మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీని కోసం, మీకు ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు లేదా ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ వ్యాపారం ఎలా లాభదాయకంగా ఉంటుందో ఇక్కడ సమాచారం ఉంది.

ప్రస్తుతం ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్ లాంటి పట్టణాల్లో ప్రజలు తమ బిజీ లైఫ్‌లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. యువకులు, బ్యాచిలర్లు ఎక్కువగా ఉదయం టిఫిన్ చేయడం బయటకు వెళ్తుంటారు.  చాలా మంది ప్రజలు ఉద్యోగం కోసం లేదా చదువు కోసం ఇంటి నుండి దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు తరచుగా నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్ దొరకక సమస్యను ఎదుర్కొంటారు. సగానికి పైగా ప్రజలు తక్కువ ఖర్చుతో ఇంటిలో లభించే ఆహారాన్ని ఎలా పొందాలనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అటువంటి పరిస్థితిలో, మీరు టిఫిన్ సర్వీస్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. టిఫిన్ వ్యాపారం మీకు లాభదాయకమైన వ్యాపారం.

10 వేల చిన్న మొత్తంతో వ్యాపారం ప్రారంభించండి
ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ఎందుకంటే మీరు దీన్ని మీ ఇంటి వంటగది నుండి ప్రారంభించవచ్చు. టిఫిన్ సర్వీస్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, కేవలం 8-10 వేలు మాత్రమే ఖర్చు చేయాలి. కొన్ని నెలల తర్వాత మీరు లాభం పొందడం ప్రారంభిస్తారు. మీ ఫుడ్ క్వాలిటీ బాగుందని, కస్టమర్‌లు భావిస్తే చాలు నెలకు రూ.1-2 లక్షల వరకు సంపాదించవచ్చు. కేవలం 10 వేల పెట్టుబడితోనే చాలా మంది ఈ టిఫిన్ వ్యాపారాన్ని ప్రారంభించి నేడు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. 

కాన్సెప్ట్ ఇదే..
ప్రస్తుతం క్లౌడ్ కిచెన్ సర్వీసులకు మంచి పేరు ఉంది. మీరు టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేస్తే, చాలా ఖర్చు అవుతుంది. అదే మీరు మీ ఇంట్లో ఉండే, క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసుకొని స్విగ్గీ, జొమాటో లాంటి సర్వీసుల ద్వారా బ్రేక్ ఫాస్ట్ అందిస్తే, చక్కటి ఆదాయం మీ సొంతం అవుతుంది. దీనికి కావాల్సిందల్లా మీ ఆవరణలో ప్రత్యేకమైన కిచెన్, అలాగే వంట సామాగ్రి, కమర్షియల్ గ్యాస్ సిలిండర్, ఆర్డర్లను పెరిగే కొద్ది వెరైటీలను పెంచుకోవాలి. ధరను అందుబాటులో ఉంచుకుంటే పెద్ద ఎత్తున్న ఆర్డర్లను పొందవచ్చు. 

నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి
తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి టిఫిన్ సర్వీస్ ప్రారంభించవచ్చు. ఇందులో అవసరమైన ఆహార పదార్థాలు, స్పూన్లు, పాత్రలు మాత్రమే కావాలి. ఈ వ్యాపారం కోసం, మీరు ఆహార నాణ్యతను జాగ్రత్తగా చూసుకోవాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా టిఫిన్ సేవ మార్కెటింగ్ సులభంగా చేయవచ్చు. మీరు Facebook. Instagramలో పేజీని సృష్టించవచ్చు. 

ఆరు నెలల తర్వాత లక్షకు పైగా లాభం
టిఫిన్ సర్వీస్ వ్యాపారంలో లాభాలు చాలా సార్లు వ్యాపారం ప్రారంభించిన నెల రోజుల తర్వాత ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు ఆరు నెలలు తర్వాత కూడా లాభం ఉండదు. అటువంటి పరిస్థితిలో ధైర్యం కోల్పోకండి. 

click me!