Bank Holidays:ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు.. ఫుల్ హాలిడేస్ లిస్ట్ ఇక్కడ చూడండి..

Published : Aug 08, 2022, 02:54 PM IST
Bank Holidays:ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు..  ఫుల్ హాలిడేస్ లిస్ట్ ఇక్కడ చూడండి..

సారాంశం

 ఆగస్టు నెలలో అంటే నేడు ఆగస్టు 8 నుండి  ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 మధ్య ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అంటే ఈ వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే బ్యాంకింగ్ కార్యకలాపాలు జరుగుతాయి.  

మీరు మీ బ్యాంకింగ్ సౌకర్యాల కోసం బ్యాంకు శాఖలపై ఆధారపడినట్లయితే మీరు ఈ వార్త మీకోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు నెలలో విడుదల చేసిన హాలిడేస్ లిస్ట్ ప్రకారం వివిధ కారణాల వల్ల ఈ నెలలో 18 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనుంది. 

ఈ నెల ఒకటో తేదీ ఆగస్టు 1న కూడా బ్యాంకులు మూతపడ్డాయి. ఆగస్టు నెలలో ఆగస్టు 8న ప్రారంభమయ్యే వారంలో ఎక్కువ సెలవులు ఉంటాయి. ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 మధ్య ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అంటే ఈ వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే బ్యాంకింగ్ కార్యకలాపాలు జరుగుతాయి. ఆగస్టు నెలలో ఈ వారం కాకుండా మిగిలిన రోజులలో  ఎన్ని రోజులు బ్యాంకులు మూతపడతాయో చూద్దాం..?

మొహర్రం కారణంగా 
రేపు మంగళవారం (ఆగస్టు 9) బ్యాంకులకు ముహర్రం సెలవు. ఆ తర్వాత శుక్రవారం (ఆగస్టు 12) రక్షా బంధన్‌కు సెలవు. కొన్ని చోట్ల ఆగస్టు 11న రక్షా బంధన్‌ సెలవు ఇవ్వనున్నారు. ఆగస్టు 13వ తేదీ రెండో శనివారం కావడంతో బ్యాంకులు మూసివేయబడతాయి. ఆగస్టు 14 ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆగస్టు 15న, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

జన్మాష్టమి హాలిడే
ఈ వారం తర్వాత ఆగస్టు 18 (గురువారం), 19 ఆగస్టు (శుక్రవారం) జన్మాష్టమి కారణంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ నెలలో నాలుగో శనివారం కావడంతో  ఆగస్టు 27న సెలవు ఉంటుంది. ఆగస్టు 28 ఆదివారం కాబట్టి బ్యాంకులు మూసివేయబడతాయి.

 ఆగస్టులో బ్యాంక్ సెలవులు   

తేదీ    రోజు    సెలవు
9 ఆగస్టు    మంగళవారం    ముహర్రం
12 ఆగస్టు    శుక్రవారం    రక్షా బంధన్
13 ఆగస్టు    శనివారం    రెండవ శనివారం
14 ఆగస్టు    ఆదివారం    వీకెండ్ హాలిడే
ఆగస్టు 15    సోమవారం    స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 18    గురువారం    జన్మాష్టమి
ఆగస్టు 19     శుక్రవారం    జన్మాష్టమి
21 ఆగస్టు     ఆదివారం    వీకెండ్ హాలిడే
27 ఆగస్టు    శనివారం    నాల్గవ శనివారం
ఆగస్టు 28    ఆదివారం    వీకెండ్ హాలిడే

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !