ప్రతీ ఒక్కరికీ డబ్బు చాలా అవసరం... అందరూ లక్షలకొద్దీ సంపాదించకపోయినా.. సంపాదించేదాన్ని జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటే ఆందోళన లేకుండా.. భవిష్యత్ భద్రంగా, అనుకున్న ప్రణాళిక ప్రకారం సాగిపోతుంది. దీనికోసం మనీ మేనేజ్ మెంట్ అవసరం.
మనీ మేనేజ్‌మెంట్ అనేది మీరు మీ డబ్బును బడ్జెట్, ఖర్చు చేయడం, ఆదా చేయడం మరియు పెట్టుబడి పెట్టడం వంటి అన్ని మార్గాలు వాడుకోవడం. మీ డబ్బును క్రెడిట్ గా ఎలా ఉపయోగించాలో, రుణాన్ని ఎలా చెల్లించాలో కూడా తెలుపుతుంది. మొత్తంగా మీ ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం అన్నమాట.
మీ డబ్బును వృధాగా కాకుండా.. ఉపయోగకరంగా ఎలా ఖర్చు చేయడానికి ఓ ఏడు చిట్కాలు మీకు ఉపయోగపడతాయి. అవేంటో చూడండి..
బడ్జెట్ వేసుకోండి..
మీకు వచ్చే ఆదాయం, మీ ఖర్చులు.. మీరనుకున్న పొదుపు ప్రణాళికలు.. వీటితో బడ్జెట్ తయారు చేసుకోండి. దీనికోసం... మీ నెలవారీ ఆదాయం.. మీ జీతం, బోనస్‌లు, పన్ను వాపసు లేదా ఇతర ఆదాయాలు రాసుకోండి. ఆ తరువాత మీ నెలవారీ ఖర్చులను రాయండి.
ఇందులో హౌసింగ్, ఆహారం, స్టూడెంట్, హౌజ్, పర్సనల్ లోన్స్.. ట్రావెలింగ్ లాంటి వి మొదటి స్థానంలో రాసుకోండి. ఆ తరువాత వినోదం, యుటిలిటీలు వస్తాయి. మీ ఆదాయం నుండి మీ ఖర్చులను తీసివేయండి. ఈ మొత్తం మీ బడ్జెట్‌కు ఓ రూపం ఇస్తాయి.
బడ్జెట్ కు.. ఆర్థికమంత్రి చీరలకు లింకుందా? ఈ సారి ఏ రంగు చీర కట్టుకోబోతున్నారు??
మీరు నెలవారీ ఖర్చుల్లో ఏవి అవసరం లేదో వాటిని తొలగించడం లేదా అవసరమైనవాటిని జోడించడం వంటి సర్దుబాట్లు చేయవచ్చు. ఇంకో ప్లాన్ ఏంటంటే.. అద్దె, బీమా, ఆహారం వంటి అవసరాలు మీ ఆదాయంలో 50% కేటాయించుకోవాలి. ఆ తరువాత మీ ఆదాయంలో 30% వినోదం వంటి మీరు కోరుకునే విషయాలకు వెళ్లవచ్చు. మిగతా 20% పొదుపు చేయాలి. ఇది చాలా సింపుల్ గా చేసుకునే లెక్క.
బడ్జెటింగ్ కి కొన్ని చిట్కాలు...
- మీ ఖర్చులను ట్రాక్ చేయడం వలన మీరు ఎక్కువ ఖర్చుపెట్టకుండా.. సహాయపడవచ్చు.
- రిటైర్మెండ్ కోసం ముందునుంచే జాగ్రత్తగా ఆలోచించండి. పదవీ విరమణ కోసం ఆదా చేయడానికి రిటైర్మెంట్ అకౌంట్లలో నెలవారీ కొంత పొదుపు చేయాలి.
- అత్యవసర పరిస్థితుల కోసం సేవ్ చేయడం. ఇంటిమరమ్మత్తులు, అనుకోని ఆర్థికి, ఆరోగ్య ఇబ్బందులు ఎదురైనప్పుడు అత్యవసర నిధిలో మీ వద్ద డబ్బు ఉంటే టెన్షన్ ఉండదు.
పొదుపు చిట్కాలు..
డబ్బును పొదుపు చేయడానికి ఏదో ఒక సేవింగ్ అకౌంట్ ని కాకుండా.. దీనికోసం కూడా షాపింగ్ చేయండి. మంచి అకౌంట్.. ఎక్కువ రిటర్న్స్ ఉండే అకౌంట్ ను ఎంచుకోండి. మెరుగైన రేటు ఇచ్చే అకౌంట్ అయితే, అదనపు వడ్డీ కాలక్రమేణా జోడించబడుతుంది. కొన్ని బ్యాంకులు అధిక-దిగుబడి పొదుపు ఖాతాలను కూడా అందిస్తాయి.
మీకొచ్చే ఎక్స్ ట్రా ఇన్ కంను సేవింగ్స్ అకౌంట్ లో వేయండి. టాక్స్ రిటర్న్, బోనస్ లాంటివి వచ్చినప్పుడు దానిని మీ సేవింగ్స్ ఖాతాలో జమ చేయవచ్చు.
ఆటోమేటిక్ పొదుపులను సెటప్ చేయండి. మీ యజమాని సహాయంతో, మీ జీతంలో సేవింగ్స్ ఖాతాకు ఆటోమేటిక్ బదిలీలను సెటప్ చేయించుకోవచ్చు. ఆ విధంగా, మీకు అవసరమైనప్పుడు డబ్బు మీకు అందుబాటులో ఉంటుంది.
అప్పులు తీర్చాలి..
అప్పులు అనవరమైన ఒత్తిడిని పెంచుతాయి. అందుకే వీలైనంత వరకు వాటిని తొందరగా చెల్లించాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా ఉండగలుగుతారు. దీనికీ కొన్ని మార్గాలున్నాయి.
మొదటిది.. స్నోబాల్ పద్ధతి. అంటే మొదట మీ చిన్న బ్యాలెన్స్‌లను చెల్లించడంపై దృష్టి పెట్టాలి. మీరు తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించిన తరువాత... చిన్న మొత్తాల్లో ఉన్న అప్పులను తీర్చేయాలి.
దీనివల్ల అధిక వడ్డీ రేట్లు ఉన్న అప్పులు చెల్లించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చని అర్థం అవుతుంది. దీర్ఘకాలంలో మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది. మీ అప్పులను వాటి వడ్డీ రేట్ల ఆధారంగా, అత్యధిక నుండి తక్కువ వరకు లిస్ట్ రాసుకుని దాని ప్రకారం చెల్లించుకుంటూ రావాలి.
ముందుగా అత్యధిక వడ్డీ రేటున్న లోన్ ను తీర్చండి. అది చెల్లించిన తర్వాత, ఆ అదనపు నిధులను మీ జాబితాలోని తదుపరి రుణాన్ని చెల్లించడానికి ఉపయోగించవచ్చు.
మంచి క్రెడిట్ అలవాట్లు
ఆర్థిక ఆరోగ్యంలో క్రెడిట్ ప్రధాన భాగం. మీ క్రెడిట్ స్కోర్‌లను మెరుగుపరచడంలో పని చేయడం వల్ల మీరు ఉజ్వలమైన ఆర్థిక భవిష్యత్తును ప్లాన్ చేసుకోవచ్చు.
కొన్ని మంచి క్రెడిట్ అలవాట్లు ఎలా ఉంటాయంటే..
మీ బిల్లులను సకాలంలో చెల్లించండి. ఆలస్య చెల్లింపులు మీ క్రెడిట్ స్కోర్‌లను ప్రభావితం చేస్తాయి. ఆలస్య రుసుము, పెనాల్టీ APRలను ప్రేరేపిస్తాయి.
క్రెడిట్ ఖాతాను మూసివేసే ముందు, అది మీ క్రెడిట్ స్కోర్‌లను ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచించండి.
మీకు అవసరమైన క్రెడిట్ కోసం మాత్రమే దరఖాస్తు చేసుకోండి. కొత్త లైన్ క్రెడిట్ కోసం దరఖాస్తు చేయడం వలన మీ స్కోర్‌లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
క్రెడిట్‌ని పర్యవేక్షణ
మీ క్రెడిట్‌ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం క్రెడిట్ ఆరోగ్యంలో మరొక ముఖ్యమైన భాగం.
ఇవన్నీ గుర్తు పెట్టుకుని బడ్జెట్ తయారు చేసుకుంటే.. దేశ, రాష్ట్ర బడ్జెట్ లలో వచ్చే మార్పులు మిమ్మల్ని.. మీ కుటుంబ బడ్జెట్ ను అంతగా ప్రభావితం చేయలేవు.