budget 2024: గృహనిర్మాణం నుండి ఉచిత విద్యుత్ వరకు, ప్రభుత్వ కొత్త పథకాలు ఏంటో తెలుసుకోండి

By Ashok kumar Sandra  |  First Published Feb 1, 2024, 12:50 PM IST

 మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రి గృహ నిర్మాణ పథకం,  రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీ స్కీమ్‌కు సంబంధించి పెద్ద ప్రకటన చేశారు.


ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2.0 చివరి సంవత్సరంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో మధ్యతరగతి ప్రజల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలను ప్రకటించారు. వీటిలో మధ్యతరగతి కోసం ప్రత్యేక గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించడం గురించి సీతారామన్ మాట్లాడారు. ఇదొక్కటే కాదు, మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీకి సంబంధించి పెద్ద ప్రకటన చేశాడు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు ఏటా విద్యుత్‌పై వెచ్చించే భారీ మొత్తంలో ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.

మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ప్రకటనలు?

Latest Videos

undefined

1. మధ్యతరగతి వారికి ఇళ్లు:
మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందిస్తుందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సీతారామన్ చెప్పారు. అద్దె ఇళ్లు లేదా మురికివాడలు లేదా  అనధికార కాలనీల్లో నివసిస్తున్న అర్హులైన మధ్యతరగతి ప్రజలు తమ సొంత ఇళ్లు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్ధిక మంత్రి   అన్నారు.


2. ఇంటి పైకప్పుపై సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం (రూఫ్‌టాప్ సోలరైజేషన్) అండ్  ఉచిత విద్యుత్తు
నిర్మల సీతారామన్ మధ్యతరగతి కుటుంబాలకు మరో పెద్ద పథకం ద్వారా సహాయం ప్రకటించారు. కోటి కుటుంబాలను రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీ పథకం పరిధిలోకి తీసుకురావడంపై ఆమె  మాట్లాడారు. నిర్మల సీతారామన్ ప్రకటన ప్రకారం, రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా, కోటి కుటుంబాలు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందగలుగుతాయి. అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ చారిత్రాత్మకమైన రోజున గౌరవప్రదమైన ప్రధానమంత్రి తీర్మానం మేరకు ఈ పథకం తీసుకురాబడింది. 
దీని నుండి ఆశించిన ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి- 

*ఉచిత సౌర విద్యుత్ ఇంకా  మిగులు విద్యుత్ పంపిణీ సంస్థలకు విక్రయించడం ద్వారా కుటుంబాలకు ప్రతి సంవత్సరం పదిహేను వేల నుండి పద్దెనిమిది వేల రూపాయల ఆదా; 

*ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్;
సరఫరా ఇంకా సంస్థాపన కోసం పెద్ద సంఖ్యలో విక్రేతలకు వ్యవస్థాపకత అవకాశం;
తయారీ, సంస్థాపన ఇంకా  నిర్వహణలో సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు;

click me!