నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021.. చర్చనీయాంశంగా మారిన టాబ్లెట్..

By S Ashok KumarFirst Published Feb 1, 2021, 4:46 PM IST
Highlights

నేడు  దేశ బడ్జెట్ 202ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే. భారత బడ్జెట్ చరిత్రలోనే మొదటిసారి పేపర్ లెస్ గా బడ్జెట్ ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు. 

మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి విషయానికి వస్తే ప్రజల మనస్సులో మొదటిగా వచ్చేది చౌకైన ఉత్పత్తి. నేడు  దేశ బడ్జెట్ 202ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే. భారత బడ్జెట్ చరిత్రలోనే మొదటిసారి పేపర్ లెస్ గా బడ్జెట్ ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు.

మేడ్ ఇన్ ఇండియా టాబ్లెట్‌ ద్వార బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్  ఉదయం 11 గంటలకు సమర్పించారు.  అయితే ఈ టాబ్లెట్ గురించి ఇప్పుడు సంచలనం  రేగుతుంది, అది ఏమిటంటే కొందరు అది ఆపిల్ ఐప్యాడ్ అని, మరికొందరు స్యామ్సంగ్ టాబ్లెట్ అని అంటున్నారు కానీ దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

మేడ్ ఇన్ ఇండియా టాబ్లెట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి, అయితే ఆపిల్, శామ్సంగ్  టాబ్లెట్ల ఉత్పత్తి ప్రస్తుతం భారతదేశంలో లేదు. కొద్ది రోజుల క్రితం లెనోవా భారతదేశంలో  టాబ్లెట్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపింది, ఐప్యాడ్ ఉత్పత్తిని చైనా నుండి భారతదేశానికి తరలించడానికి ఆపిల్ కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

also read బడ్జెట్ 2021-22: ఈ ఏడాది బడ్జెట్ ప్రత్యేకత, కొత్త విషయాలు ఏంటో తెలుసుకోండి.. ...

ఆకాష్ టాబ్లెట్‌ 
ప్రస్తుతం ఆకాష్ టాబ్లెట్‌ గురించి ప్రజలు అంచనా వేస్తున్నారు. ఇది మేడియన్ ఇన్ ఇండియా టాబ్లెట్. ఇది ప్రతి భారతీయుడి  చేతుల్లో ఉంటుంది. ఆకాష్ టాబ్లెట్‌ను కెనడియన్ కంపెనీ డేటావిండ్ ప్రవేశపెట్టింది. 1,130 రూపాయల సబ్సిడీతో కంపెనీ 2011 లో మొదటి టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఆకాష్ టాబ్లెట్ ప్రపంచంలోనే చౌకైన ఆండ్రాయిడ్ టాబ్లెట్, కానీ 2019లో కంపెనీ టాబ్లెట్ల తయారీని ఆపివేసింది.

 'ఆకాష్ టాబ్లెట్'నా అసంపూర్ణ కల: కపిల్ సిబల్
2013లో టెలికాం మంత్రిగా ఉన్న కపిల్ సిబల్ ఆకాష్ టాబ్లెట్‌ నా కల అని తెలిపాడు. తక్కువ ధరకె ఆకాష్ టాబ్లెట్ తీసుకురావాలన్న నా కల నెరవేరలేదని కపిల్ సిబల్ 2013 డిసెంబర్‌లో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆకాష్ టాబ్లెట్‌ను ఒక దశకు తీసుకురావడంలో కొన్ని విభాగాలు తనతో సహకరించలేదని సిబల్ చెప్పారు. 

కపిల్ సిబ్ల్ 2011లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు  ఆకాష్ టాబ్లెట్  ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు కంప్యూటర్ పరికరాలను సబ్సిడీ రేటుకు అందించడం, తద్వారా వారు విద్య  ప్రయోజనం కోసం ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. కెనడియన్ కంపెనీ డేటావిండ్ ఆకాష్ టాబ్లెట్  మొదటి, రెండవ వెర్షన్లను ఉత్పత్తి చేసే అవకాశాన్ని కలిగి ఉంది.

click me!