బడ్జెట్ మాయ... భారీగా పెరిగిన బంగారం ధర

By telugu teamFirst Published Jul 5, 2019, 4:52 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎఫెక్ట్ బంగారంపై బాగా చూపించింది. ఒక్కరోజే బంగారం ధర బారీగా పెరిగిపోయింది. 


కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎఫెక్ట్ బంగారంపై బాగా చూపించింది. ఒక్కరోజే బంగారం ధర బారీగా పెరిగిపోయింది. బడ్జెట్ లో భాగంగా బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కారణంతో ఒక్కరోజే బంగారం ధర రూ.590 పెరిగింది.

ఇప్పటికే రూ.34వేలు ఉన్న బంగారం ధర ఈ రోజు పది గ్రాములకు రూ.590 పెరిగింది. దీంతో... బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.34,800కి చేరింది. అయితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. రూ.80తగ్గడంతో కేజీ వెండి ధర రూ.38,500కి చేరింది.

బంగారం, ఇతర లోహాలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. దీని ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

click me!