కేంద్ర బడ్జెట్... మహాత్మా గాంధీకి అరుదైన గౌరవం

By telugu teamFirst Published Jul 5, 2019, 4:18 PM IST
Highlights

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా... ఈ బడ్జెట్ లో మహాత్మా గాంధీకి అరుదైన గౌరవం కల్పించారు. 

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా... ఈ బడ్జెట్ లో మహాత్మా గాంధీకి అరుదైన గౌరవం కల్పించారు. గాంధీ మహాత్ముని గొప్పతనం తెలియచేయాలనే ఉద్దేశంతో వికీపీడియా తరహాలోనే 'గాంధీపీడియా' ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

 గాంధీ జీవిత చరిత్ర గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలని కేంద్రం భావిస్తోంది. స్వాతంత్రం కోసం ఆయన చేసిన కృషిని భారత సమాజం గుర్తుపెట్టుకోవడం కోసం 'గాంధీపీడియా' ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. ప్రతి ఏటా అక్టోబర్ 2న గాంధీజీ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. 

అయితే ఈసారి జరుపుకోబోయే గాంధీ జయంతి 150వది కావడం ఒక ప్రత్యేకత. అందువల్ల గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకొని.. గాంధీపీడియా ద్వారా మహాత్ముని విలువలు, ఆయన గొప్పతనంతో పాటు.. ఆయన చేసిన బోధనలను కూడా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

click me!