Big Bazaar Retail stores: ఇక‌పై రిలయన్స్ ఆధీనంలో బిగ్‌బజార్ స్టోర్స్..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 27, 2022, 11:40 AM IST
Big Bazaar Retail stores: ఇక‌పై రిలయన్స్ ఆధీనంలో బిగ్‌బజార్ స్టోర్స్..!

సారాంశం

రిలయన్స్ రిటైల్స్ 200 బిగ్ బజార్ స్టోర్స్‌ను తన ఆధీనంలోకి తీసుకోనుంది. కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్స్‌ను కొనుగోలు చేయడానికి రెండు సంవత్సరాలుగా రిలయన్స్ రిటైల్స్ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ డీల్ విలువ 24,731 కోట్ల రూపాయలు.

రిటైల్ షాప్స్ ఇక దశలవారీగా దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ సంస్థల్లో చేరిపోనున్నాయి. తొలిదశలో దేశవ్యాప్తంగా 200 ఫ్యూచర్ రిటైల్స్‌ షాప్స్ రిలయన్స్ పరం కాబోతోన్నాయి. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖేష్ అంబానీ గ్రూప్ సంస్థలు- వాటిని తన ఆధీనంలోకి తీసుకోవడమే మిగిలివుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ రిటైల్స్ వాటిని తన సొంతం చేసుకోనుంది. బిగ్ బజార్‌ను ప్రమోట్ చేస్తోన్న కంపెనీ ఫ్యూచర్ రిటైల్స్. 

ఈ సంస్థ యాజమాన్యం రిలయన్స్ రిటైల్స్‌కు లీజ్ పేమెంట్స్‌ను చెల్లించడంలో విఫలమైంది. దీనితో రిలయన్స్ రిటైల్స్ 200 బిగ్ బజార్ స్టోర్స్‌ను తన ఆధీనంలోకి తీసుకోనుంది. కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్స్‌ను కొనుగోలు చేయడానికి రెండు సంవత్సరాలుగా రిలయన్స్ రిటైల్స్ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ డీల్ విలువ 24,731 కోట్ల రూపాయలు.

ఈ విషయంలో ఫ్యూచర్స్ గ్రూప్‌లో 10 శాతం మేర పెట్టుబడులు పెట్టిన అమెజాన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల అవి సఫలం కావట్లేదు. ఈ న్యాయ పోరాటం విషయంలో ఫ్యూచర్స్ గ్రూప్.. తన కంపెనీని పూర్తిస్థాయిలో రిలయన్స్‌ రిటైల్స్‌కు విక్రయించుకోలేకపోయింది. అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితులను ఎదుర్కొనడం వల్ల రోజువారీ వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోవడంతో అప్పులపాలైంది.ఈ పరిస్థితుల మధ్య రిలయన్స్ రిటైల్స్‌కు లీజ్ పేమెంట్స్‌ను చెల్లించలేకపోయింది. లీజ్ పేమెంట్స్‌ మొత్తానికి సమానంగా 200 లేదా అంతకంటే ఎక్కువ బిగ్ బజార్ స్టోర్స్‌ను రిలయన్స్‌కు బదలాయించడానికి అంగీకరించింది ఫ్యూచర్స్ గ్రూప్ మేనేజ్‌మెంట్. దేశవ్యాప్తంగా 1,700 బిగ్ బజార్ స్టోర్స్ ఉన్నాయి. ఇందులో కనీసం 200 స్టోర్స్ రిలయన్స్ ఆధీనంలోకి వెళ్లిపోనున్నాయి. వాటిని రీబ్రాండ్ చేయనుంది రిలయన్స్. బిగ్‌బజార్ పేరును తొలగించి- రిలయన్స్ రిటైల్స్ పేరును పెట్టనుంది.

పూర్తిస్థాయిలో బిగ్‌బజార్ స్టోర్స్‌ను షట్‌డౌన్ చేయాల్సిన పరిస్థితి వస్తే- వాటి విలువ ఇంకా తగ్గుతుందనేది కిషోర్ బియాని ఆందోళన. అందుకే వీలైనంత త్వరగా రిలయన్స్ రిటైల్స్‌తో డీల్‌ను ముగించుకోవాలని ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో తన వాటాదారుగా ఉంటూ వస్తోన్న అమెజాన్ అడ్డు పడటం వల్ల ఇందులో జాప్యం ఏర్పడింది. ఫలితంగా- అసలే నష్టాల్లో ఉన్న ఫ్యూచర్స్ గ్రూప్.. రిలయన్స్‌కు లీజ్ పేమెంట్స్ చెల్లించడంలో విఫలమైంది.

PREV
click me!

Recommended Stories

Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్