విమానయాన దిగ్గజం బోయింగ్‌లో లేఆఫ్స్‌: 17 వేల మంది ఉద్యోగుల తొలగింపు

By Galam Venkata Rao  |  First Published Oct 12, 2024, 11:47 AM IST

విమానయాన దిగ్గజం బోయింగ్ 10% ఉద్యోగులను ఉద్వాసన పలికింది. దాంతో 17 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. బోయింగ్ ప్రెసిడెంట్, సీఈఓ కెల్లీ ఆర్ట్ బర్గ్ ఈ నిర్ణయాన్ని సిబ్బందికి ఈ-మెయిల్ ద్వారా ప్రకటించారు.
 


విమానయాన దిగ్గజ సంస్థ బోయింగ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన సంస్థలో పనిచేసే 10 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అంటే 17 వేల మంది ఉద్యోగులను తొలగించింది. బోయింగ్ ప్రెసిడెంట్, సీఈఓ కెల్లీ ఆర్ట్ బర్గ్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ సిబ్బందికి ఈ- మెయిల్ పంపారు.

ఈ తొలగింపులు ''రాబోయే నెలల్లో" జరుగుతాయని పేర్కొన్నారు. ఇంకా, "ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్ల నుంచి ఉద్యోగుల వరకు ఈ లేఆఫ్‌లో ఉన్నట్లు బోయింగ్‌ ప్రకటించింది.

Latest Videos

undefined

"మా వ్యాపారం క్లిష్టమైన స్థితిలో ఉంది. మేము ఎదుర్కొనే సవాళ్లన్నీ వివరించడం కష్టం. మా ప్రస్తుత పరిస్థితులను అధిగమించేందుకు, సంస్థను పునరుద్ధరించడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము పోటీగా ఉండటానికి, దీర్ఘకాలికంగా మా వినియోగదారులకు సేవలు అందించడానికి నిర్మాణాత్మక మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది'' కంపెనీ తెలిపింది.

''కంపెనీ క్లిష్టమైన సంవత్సరాన్ని ఎదుర్కొంటున్నందున ఈ ప్రకటన వచ్చింది. 30 వేల మందికి పైగా బోయింగ్ ఫ్యాక్టరీ కార్మికులు సెప్టెంబర్ మధ్య నుంచి సమ్మెలో ఉన్నారు. మా ఆర్థిక వాస్తవికతకు అనుగుణంగా, మరింత దృష్టి సారించిన ప్రాధాన్యతలకు అనుగుణంగా మా శ్రామిక శక్తి స్థాయిలను రీసెట్ చేయాలి" అని బోయింగ్‌ సీఈవో కెల్లీ ఆర్ట్ బర్గ్ తెలిపారు.

''రాబోయే నెలల్లో మా మొత్తం ఉద్యోగుల పరిమాణాన్ని సుమారు 10 శాతం తగ్గించాలని యోచిస్తున్నాం. ఈ తగ్గింపుల్లో ఎగ్జిక్యూటివ్ లు, మేనేజర్లు, ఉద్యోగులు ఉంటారు. దీనిపై మరింత సమాచారాన్ని నాయకత్వ బృందం పంచుకుంటుంది'' అని కెల్లీ ఆర్ట్ బర్గ్ వివరించారు.

ఉద్యోగుల తొలగింపుతో పాటు, మొదటి 777 ఎక్స్ విమానం డెలివరీని 2026కు వాయిదా వేస్తున్నట్లు బయింగ్‌ సీఈవో తెలిపారు. 777ఎక్స్ ప్రోగ్రాంలో "అభివృద్ధిలో ఎదుర్కొన్న సవాళ్లు, ఫ్లైట్ టెస్ట్ విరామం, కొనసాగుతున్న వర్క్ స్టాప్ కారణంగా మా ప్రోగ్రామ్ టైమ్ లైన్ ఆలస్యం అవుతుంది. 2026లో మొదటి డెలివరీని ఆశిస్తున్నామని ఆర్ట్ బర్గ్‌ వెల్లడించారు. మా వినియోగదారులు ఆర్డర్ చేసిన మిగిలిన 767 ఫ్రైటర్లను నిర్మించి డెలివరీ చేయాలని యోచిస్తున్నామననారు. తరువాత 2027లో వాణిజ్య కార్యక్రమం ఉత్పత్తిని ముగించాలనే యోచనలో ఉన్నామని చెప్పారు. కేసీ-46ఏ ట్యాంకర్ ఉత్పత్తి కొనసాగుతుందని బోయింగ్ సీఈఓ ఆర్ట్‌ బర్గ్‌ స్పష్టం చేశారు.

click me!