మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న 6 గేర్స్ సూపర్ బైక్: లుక్ అదుర్స్

By Naga Surya Phani KumarFirst Published Oct 3, 2024, 11:41 PM IST
Highlights

సాధారణంగా మన బైక్ 4 గేర్లు కలిగి ఉంటుంది కదా.. ఇంకొన్నికంపెనీల బైక్ లు అయితే 5 గేర్లు ఉన్నవి కూడా ఉన్నాయి. ఇలాంటివి చాలా తక్కువ. కార్లయితే కచ్చితంగా 5 గేర్లు ఉంటాయి. కొన్ని బ్రాండెడ్ కార్లు 6 గేర్లు కూడా కలిగి ఉంటాయి. కాని 6 గేర్లు ఉన్న బైక్ గురించి ఎప్పుడైనా విన్నారా? స్పోర్ట్స్ కార్లతో పోటీగా దూసుకుపోతున్న ఈ బైక్ ప్రపంచ మార్కెట్ లో దుమ్ము రేపుతోంది. అమ్మకాల్లో దూసుకుపోతోంది. అయితే ఇది ఇంకా ఇండియాకు రాలేదు. ఇది ఎప్పుడు ఇండియాలో లాంఛ్ అవుతుంది. దాని ఫీచర్స్, స్పెషాలిటీస్, లాంటి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. పూర్తిగా కథనం చదవండి. 
 

జపాన్ కు చెందిన స్పోర్ట్స్ టూరింగ్ బైక్ తయారీ సంస్థ అయిన కవాసకి 2025 Kawasaki Ninja 1100 SX బైక్ ని విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో అనేక కొత్త హంగులతో విడుదలైన ఈ బైక్ స్టాండర్డ్, SE అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

Kawasaki Ninja 1100 SX 

కొత్త కవాసకి నింజా 1100 SX(2025 Kawasaki Ninja 1100 SX) 1099సిసి, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్-ఫోర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 136 బిహెచ్‌పి శక్తిని, 7,600 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తోంది. 1,500 ఆర్‌పిఎమ్ నుండి పనిచేసే న్యూ స్పెషల్ స్పీడ్ షిఫ్టర్ కూడా ఉంది.

Latest Videos

rpm పరిధిలో టార్క్ కర్వ్ ను మెరుగుపరిచే విధంగా ఇంజిన్‌ను ట్యూన్ చేసినట్లు కవాసకి పేర్కొంది. హైవేలపై ప్రయాణించేటప్పుడు సున్నితమైన రైడింగ్ అనుభవాన్ని అందించడానికి ఐదవ, ఆరవ గేర్‌లు ఉపయోగపడనున్నాయి. 

Kawasaki Ninja 1100 SX SE గోల్డ్, బ్లాక్ రంగు గ్రాఫిక్స్ అదుర్స్

ఓవరాల్ గా చూస్తే 2025 మోడల్‌కి, మునుపటి మోడల్‌కి పెద్దగా తేడా లేదు. ముందు భాగంలో ట్విన్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు ఉన్నాయి. టెయిల్ లైట్‌లో కూడా ట్విన్ ఎల్‌ఈడీ ఇచ్చారు. రెండూ ఒకేలా ఉన్నాయి. SE వేరియంట్‌లో గోల్డ్, బ్లాక్ రంగు గ్రాఫిక్స్ ఉన్నాయి. బైక్ ఆకుపచ్చ రంగుకు భిన్నంగా కనిపించేది ఇదొక్కటే.

ఇందులో కొత్తది, చాలా పెద్దది అయిన రియర్ డిస్క్ బ్రేక్ ఉంది. Kawasaki Ninja 1100 SX SE ముందు భాగంలో Brembo Monobloc 4.32 కాలిపర్‌లను కలిగి ఉంది. Ohlins S36 అడ్జస్టబుల్ మోనోషాక్ ఉంది. ఇది మునుపటి మోడల్‌లో లేదు. కొత్త Bridgestone Battlax S23 టైర్లు 17 అంగుళాల సైజులో ఉన్నాయి.

Kawasaki Ninja 1100 SX SE ఆకర్షణీయమైన ఫీచర్లు

నింజా 1100 SX అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. LED లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT డిస్ప్లే, పవర్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ABS, USB-C ఛార్జింగ్ పోర్ట్ వంటివి ప్రధానమైనవి. SE వేరియంట్‌లో హీటెడ్ గ్రిప్‌లు ఉన్నాయి.

ప్రపంచ మార్కెట్లో విడుదలైన 2025 కవాసకి నింజా 1100 SX ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో విడుదల కావచ్చని భావిస్తున్నారు. డిసెంబర్‌లో జరిగే ఇండియా బైక్ వీక్ ఈవెంట్‌లో దీన్ని ఆవిష్కరించే అవకాశం ఉందని సమాచారం.

click me!