కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో బిల్ గేట్స్ మర్యాద పూర్వక భేటీ , అలనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్న రాజీవ్..

Published : Mar 02, 2023, 12:10 AM IST
కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో బిల్ గేట్స్ మర్యాద పూర్వక భేటీ , అలనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్న రాజీవ్..

సారాంశం

కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కు సంబంధించి సంభాషణ జరిగింది.

Bill Gates met MoS Rajeev Chandrasekhar: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ బుధవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు దిగ్గజాల మధ్య సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కు సంబంధించి సంభాషణ జరిగింది. గేట్స్ తన సంతకంతో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కు పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.

కోవిడ్ -19 మహమ్మారి తరువాత బిల్ గేట్స్ భారతదేశంలో చేసిన మొదటి పర్యటన ఇదే. ఫిబ్రవరి 27 న, భారతదేశం సందర్శించడానికి ముందు, బిల్ గేట్స్ కరోనా మహమ్మారితో భారత్ వ్యవహరించిన తీరును, ఆర్థిక వ్యవస్థను బలమైన పద్ధతిలో కొనసాగించినందుకు ప్రత్యేకంగా ప్రశంసించారు. ట్వీట్‌లో ఇతర దేశాల మాదిరిగానే, భారతదేశానికి కూడా పరిమిత వనరులు ఉన్నాయని, అయితే అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రపంచం ఎలా పురోగమిస్తుందో మాకు చూపించిందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ అమెరికాలో గడిపిన పాత రోజులను గుర్తుచేసుకున్నారు.  గేట్స్, కేంద్ర మంత్రి మధ్య సంభాషణ సందర్భంగా, రాజీవ్ చంద్రశేఖర్ యుఎస్ లో గడిపిన పాత రోజులను జ్ఞాపకం చేసుకున్నారు. రాజకీయాల్లో చేరడానికి ముందు, రాజీవ్ చంద్రశేఖర్ ఐటీ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్నారు. 1986 లో ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చికాగో నుండి కంప్యూటర్ సైన్స్ లో  రాజీవ్ మాస్టర్స్ ప్రోగ్రాంను పూర్తి చేశారు. ఇదిలా ఉంటే రాజీవ్ చంద్ర శేఖర్ కెరీర్ తొలినాళ్లలో మొదటి ఆఫర్ బిల్ గేట్స్ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ నుండి వచ్చింది. ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ యుఎస్ ప్రముఖ సాంకేతిక సంస్థలలో ఒకటిగా ఉంది. 

ఇంటెల్ కంపెనీ కెఫెటేరియాలో బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, లారీ ఎలిసెన్‌లు సరదాగా గడిపుతుంటే చూసేవారమని కేంద్ర మంత్రి తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. రాజీవ్ చంద్రశేఖర్ ఇంటెల్  కంపెనీలో సీనియర్ డిజైన్ ఇంజనీర్‌గా పనిచేశారు. భారతదేశానికి వచ్చిన తరువాత, అతను 1994 లో బిపిఎల్ మొబైల్‌ను స్థాపించాడు, భారతదేశంలోనే మొట్టమొదటి మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ కావడం విశేషం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !